- మున్సిపల్ కార్మికుల సేవలు వెలకట్టలేనివి…!
- మున్సిపల్ కార్మికులకు సన్మానం
- పాల్గొన జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కావాలి సంతోష్
జనవాహిని ప్రతినిధి తాండూరు : అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా శుక్రవారం పట్టణంలో మున్సిపల్ కార్మికులను ఘనంగా సన్మానించారు. సమాజ ఆరోగ్యం కోసం నిరంతరం శ్రమిస్తున్న కార్మికుల సేవలను గుర్తించి, వారిని గౌరవించుకోవడం మనందరి బాధ్యత అని వికారాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి కావలి సంతోష్ పేర్కొన్నారు.మున్సిపల్ కౌన్సిలర్ బాలకృష్ణ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కావలి సంతోష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తాండూరు మున్సిపల్ పరిధిలోని 24వి వార్డ్ కు చెందిన మున్సిపల్ జవాన్, కార్మికులను అనంతరం శాలువాలతో ఘనంగా సన్మానించి మే డే శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సమాజం పరిశుభ్రంగా ఉండటంలో మున్సిపల్ కార్మికుల పాత్ర అత్యంత కీలకమని, వారు లేనిదే వ్యవస్థ నడవదని కొనియాడారు. కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ రఘు పటేల్, ముఖ్య నాయకులు రాజశేఖర్ రెడ్డి, వెంకట్ ముదిరాజ్, సత్యవర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కార్మికుల సంక్షేమానికి తామంతా అండగా ఉంటామని ఈ సందర్భంగా నేతలు హామీ ఇచ్చారు.




