సుదీష్ణ కు బిఎస్ఆర్ దంపతుల ప్రశంసలు

- జాతీయ స్థాయి క్రికెట్ పోటీలకు సాయి సుదీష్ణ శెట్టి ఎంపిక
- యువ క్రికెటర్‌ను అభినందించిన బి.ఎస్.ఆర్ దంపతులు
- నేషనల్స్ లో తాండూరు యువతి: బి.ఎస్.ఆర్ దంపతుల హర్షం.
జనవాహిని ప్రతినిధి తాండూరు : తాండూరు పట్టణానికి చెందిన యువ క్రికెట్ ఆణిముత్యం సాయి సుదీష్ణ శెట్టి జాతీయ స్థాయి క్రికెట్ పోటీలకు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా ఆమె సాధించిన ప్రతిభను అభినందిస్తూ, పట్టణ ప్రముఖులు, కాంగ్రెస్ నాయకులు బుయ్యని శ్రీనివాస్ రెడ్డి,సరళ శ్రీనివాస్ రెడ్డి దంపతులు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా బి.ఎస్.ఆర్ దంపతులు మాట్లాడుతూ.. తాండూరు ప్రాంతానికి చెందిన క్రీడాకారిణి జాతీయ స్థాయికి ఎంపిక కావడం ఇక్కడి ప్రజలందరికీ గర్వకారణమని పేర్కొన్నారు. సాయి సుదీష్ణ శెట్టి పట్టుదల, కఠిన సాధన మరియు క్రమశిక్షణే ఆమెను ఈ స్థాయికి చేర్చాయని వారు కొనియాడారు.భవిష్యత్తులో ఆమె మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, జాతీయ మరియు అంతర్జాతీయ స్థాయిలో రాణించి తాండూరు పేరును దేశవ్యాప్తంగా చాటిచెప్పాలని వారు ఆకాంక్షించారు. నేటి యువత క్రీడల పట్ల ఆసక్తి చూపిస్తూ, రాష్ట్రానికి మరియు దేశానికి గౌరవం తీసుకురావడం ఎంతో అభినందనీయమని వారు ఈ సందర్భంగా పేర్కొన్నారు.





