- రైతు పక్షపాతి పట్లోళ్ల శంకర్ రెడ్డికి ఘన సత్కారం
- సొంత గ్రామం రెడ్డి ఘనపూర్‌లో సంబరాలు
జనవాహిని ప్రతినిధి తాండూరు : తాండూరు నియోజకవర్గ అగ్రికల్చరల్ టెక్నాలజీ మేనేజ్మెంట్ ఏజెన్సీ (ఆత్మ) కమిటీ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన పట్లోళ్ల శంకర్ రెడ్డికి ఆయన సొంత గ్రామమైన రెడ్డి ఘనపూర్‌లో ఘన స్వాగతం లభించింది. శనివారం గ్రామ పర్యటనకు విచ్చేసిన ఆయనను స్వామి వివేకానంద కమిటీ సభ్యులు అత్యంత ఘనంగా సత్కరించారు.శంకర్ రెడ్డిని పుష్పగుచ్ఛాలతో అభినందించి, శాలువాతో సన్మానించిన అనంతరం కమిటీ సభ్యులు మాట్లాడారు. నియోజకవర్గ స్థాయి కీలక పదవికి శంకర్ రెడ్డి ఎంపికవ్వడం రెడ్డి ఘనపూర్ గ్రామానికి గర్వకారణమని, ఆయన నియామకం గ్రామానికి రాజకీయంగా కొత్త గుర్తింపును తెచ్చిందని వారు ఆనందం వ్యక్తం చేశారు.ఆత్మ కమిటీ చైర్మన్ హోదాలో నియోజకవర్గంలోని రైతులకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిస్తూ, వారి అభ్యున్నతికి కృషి చేయాలని సభ్యులు కోరారు. రానున్న రోజుల్లో ఆయన రాజకీయంగా మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో దండోతి శ్రీనివాస్ ముదిరాజ్, మంగలి గోవింద్, మ్యాతరి బాలు మహారాజ్, ఈ రెడ్డిపల్లి అశోక్ ముదిరాజ్, తలారి బసంత్, చాకలి అశోక్ తదితరులు పాల్గొన్నారు.






