Sunday, March 29, 2026

విశ్వ ఆద్విక్ జన్మదిన వేడుకల్లో సీఎం రేవంత్

-

spot_img
spot_img
spot_img
  • ముఖ్యమంత్రి సమక్షంలో వైభవంగా ‘విశ్వ ఆద్విక్’ పుట్టినరోజు వేడుకలు
  • తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి మనవడిని ఆశీర్వదించిన రేవంత్ రెడ్డి

జానవాహిని ప్రతినిధి తాండూరు : తాండూరు శాసనసభ్యులు బుయ్యని మనోహర్ రెడ్డి మనవడు, బుయ్యని శివకుమార్ రెడ్డి – కావ్య దంపతుల కుమారుడు బుయ్యని విశ్వ ఆద్విక్ ప్రథమ జన్మదిన వేడుకలు శనివారం అత్యంత వైభవంగా జరిగింది. జన్వాడలోని ఆర్య కన్వెన్షన్ వేదికగా జరిగిన ఈ వేడుకకు రాజకీయ, అధికార వర్గాల ప్రముఖులు భారీగా తరలివచ్చారు.ఈ వేడుకకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వేడుకలో పాల్గొన్న ముఖ్యమంత్రి, చిన్నారి విశ్వ ఆద్విక్‌ను ఎత్తుకొని ఆశీర్వదించారు. అనంతరం ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి కుటుంబ సభ్యులకు తన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ వేడుకలో రాష్ట్ర క్యాబినెట్ మంత్రులు, ఎంపీలు, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మరియు వివిధ పార్టీల ముఖ్య నాయకులు పాల్గొన్నారు. జిల్లా మరియు రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులు హాజరై శుభాకాంక్షలు తెలిపారు.తాండూరు నియోజకవర్గంలోని ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు, అభిమానులు మరియు కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.వచ్చిన అతిథులందరినీ ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి ఆత్మీయంగా ఆహ్వానించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

FOLLOW US

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe

Related Stories