- విద్యుత్ తీగలకు అడ్డుగా ఉన్న చెట్లను తొలగించాలి
- అధికారులకు వినతి పత్రం అందజేసిన అనిల్
జనవాహిని ప్రతినిధి తాండూరు : తాండూర్ పట్టణంలోని ఇందిరా నగర్ 6వ వార్డ్ లో విద్యుత్ తీగలకు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మల వల్ల స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ ప్రాంతంలోని పార్కు వద్ద ఉన్న విద్యుత్ స్తంభాలకు ఆనుకుని చెట్లు, కొమ్మలు ప్రమాదకరంగా పెరిగాయని వార్డ్ అభ్యర్థి బి. అనిల్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు.ఈ చెట్ల వల్ల తరచూ విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగడమే కాకుండా, వర్షాకాలంలో గాలులకు చెట్లు కూలి విద్యుత్ తీగలపై పడే ప్రమాదం ఉందని ఆయన పేర్కొన్నారు. దీనివల్ల ప్రాణ, ఆస్తి నష్టం జరిగే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు.ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని విద్యుత్ శాఖ అధికారులు స్పందించి, వెంటనే ఆ చెట్లను లేదా అడ్డుగా ఉన్న కొమ్మలను తొలగించాలని కోరుతూ అసిస్టెంట్ ఇంజనీర్ (ఏ.ఈ) కు వినతి పత్రం అందజేశారు.






