లంచం తీసుకుంటూ దొరికిండు…!

- ఓ వెంచర్ రిజిస్ట్రేషన్ కోసం డబ్బులు డిమాండ్
- ఏసీబీ ని సందర్శించిన బాధితుడు
- రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఏసీబీ అధికారులు
జనవాహిని ప్రతినిధి తాండూరు : వికారాబాద్ జిల్లా తాండూర్ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఏసీబీ దాడులు. ఇన్చార్జ్ సబ్ రిజిస్టర్, జూనియర్ అసిస్టెంట్ సాయి 16 వేల లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టపడ్డాడు. 11 డాకుమెంట్ లా రిజిస్ట్రేషన్ కొరకు 20,వేలు డిమాండ్ చెయ్యడం తో బాధితుడు ఏసీబీ అధికారులను సందర్శించారు. ఓ వ్యక్తి తన వెంచర్ కు సంబంధించిన రిజిస్ట్రేషన్ కొరకు స్లాట్ బుకింగ్ చేసుకున్నారు . డాక్యుమెంట్స్ రిజిస్ట్రేషన్ చేయాలంటే డబ్బులు ఇవ్వాలని ఇంచార్జి సబ్ రిజిస్టర్ డిమాండ్ చేశారు. దింతో బుధవారం 4 డాక్యుమెంట్ లు రిజిస్టర్ చేసి 16వేల 500 రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. ఇంకా 7 డాక్యుమెంట్ లు రిజిస్టర్ చేయాల్సి ఉంది. ఇందులో డాక్యుమెంట్ రైటర్ సాయి కుమార్, డాక్యుమెంట్ అసిస్టెంట్ అశోక్ లు కూడా ఉన్నారు. ఈ ముగ్గురిని ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్టుగా ఏసీబీ డీఎస్పీ ఆనంద్ కుమార్ వెల్లడించారు. గత 3 ఏళ్ల క్రితం ఇదే డిసెంబర్ నెలలో సబ్ రిజిస్టర్ లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. ప్రస్తుతం కూడా ఇదే నెలలో సబ్ రిసర్ కార్యాలయంలో ఏసీబీ దాడులు జరగడం విశేషం. ఈ సందర్భంగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఏసీబీ డిఎస్పి ఆనంద్ కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వ కార్యాలయాలలో ఉద్యోగులు ఎవరైనా లంచాలు అడిగితే 1064 కు కాల్ చేసి పిర్యాదు సంప్రదించాలని ప్రజలకు సూచించారు.



