సర్పంచ్ ఎన్నికల్లో రికార్డ్…!

- 40 ఏళ్ల చరిత్రను తిరగ రాసిన సంగెమ్ కలాన్
- కాంగ్రెస్ కంచుకోటలో కారు జోరు
- ఎంపీపీ పై ఘన విజయం
- మరో చరిత్ర సృష్టిస్తామంటున్న బిఆర్ఎస్ నాయకులు
జనవాహిని ప్రతినిధి తాండూరు : స్థానిక ఎన్నికల చరిత్రలో సంగెమ్ కలాన్ సరికొత్త అధ్యాయాన్ని లిఖించింది. దశాబ్దాలుగా పాతుకుపోయిన రాజకీయ చరిత్రను తిరగరాసింది. గత 40 ఏళ్ల పాలనకు ఈ సర్పంచ్ ఎన్నిక పులిస్టాప్ పెట్టింది. తాండూరు మండలం సంగెమ్ కలాన్ గ్రామపంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి స్థానిక ఎంపీపీ పై బిఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి మీనాక్షి అనిల్ గెలుపొందడం ప్రస్తుతం సంగెమ్ కలాన్ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చేసింది. ఎంతో ఉత్కంఠ గా సాగిన ఈ ఎన్నికల్లో అధికార పార్టీ బలపర్చిన అభ్యర్థి పై ప్రతిపక్ష బిఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థి విజయం సాధించడం రాజకీయ పెను మార్పుకు నాంది. 40 ఏళ్లుగా ఉన్న రాజకీయ సమీకరణాలను ఛేదించి సామాన్య ప్రజల బలంతో ఎంపీపీ లాంటి పట్టున్నా నేతను ఓడించడం ఒక చారిత్రక ఘట్టంగా నిలిచింది. మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి సహకారంతో, రాజకీయ వ్యూహాలతోనే విజయం సాధించడం జరిగిందని నూతన సర్పంచ్ గా ఎన్నికైన మీనాక్షి అనిల్ పేర్కొన్నారు. గ్రామస్థాయిలో బిఆర్ఎస్ పై ప్రజలు పెట్టుకున్న నమ్మకం తోనే గెలుపు లభించిందని తెలిపారు. 40 ఏళ్ల చరిత్రను బిఆర్ఎస్ పంచాయతీ ఎన్నికల తో చెరిపేసింది. ఈ అసాధారణ గెలుపు, గ్రామంలోని యువత మహిళలు, మార్పు కోరుకునే వర్గాలలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. మీనాక్షి అనిల్ నాయకత్వంలో సంగెమ్ కలాన్ గ్రామం మరింత అభివృద్ధి చెందుతుందని, అభివృద్ధిలో మరో కొత్త చరిత్రను సృష్టిస్తామని బిఆర్ఎస్ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.



