
- శ్రీ రామ మందిర పునర్నిర్మాణానికి విరాళాల వెల్లువ
- తాండూరు పట్టణ దాతల ఉదారత
జనవాహిని ప్రతినిధి తాండూరు : తాండూరు పట్టణం ఇందిరా నగర్‌లోని ఏకైక శ్రీ రామ మందిర పునర్నిర్మాణ పనులు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఈ ఆలయ పునర్నిర్మాణానికి పట్టణంలోని పలువురు ప్రముఖులు, భక్తులు తమ వంతు ఆర్థిక సాయాన్ని అందిస్తూ ఉదారత చాటుకుంటున్నారు. బుధవారం ఆలయ కమిటీకి పలువురు దాతలు విరాళాలు నగదును అందజేశారు.విరాళాలు అందజేసిన దాతలు… కర్ణం సందీప్ కుమార్: ₹11,111/- గుబ్బ యాదయ్య: ₹16,101/- తర్లపల్లి పురుషోత్తం: ₹11,000/- మురళీమోహన్ గౌడ్: ₹10,000/- వీరమల్లు మల్లేశం: ₹5,101/- రొంపల్లి శ్రీనివాస్: ₹5,101/-
వీరితో పాటు కర్ణం రాజేశ్వర్ రావు, కర్ణం సునీల్ కుమార్ కూడా ఆలయ నిర్మాణానికి తమ వంతు ఆర్థిక సహకారాన్ని అందజేశారు.ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ.. “ఇందిరా నగర్ లోని ఈ పురాతన రామ మందిరాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. దాతల సహకారం మరువలేనిది” అని కొనియాడారు.



