- తాండూరు ఇంచార్జ్ ఆకుల రవీందర్
- ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటం
- పవన్ కళ్యాణ్ ఆశయాలే మాకు మార్గదర్శకం
జనవాహిని ప్రతినిధి తాండూరు : రానున్న తాండూరు మున్సిపల్ ఎన్నికలలో జనసేన పార్టీ ఘనంగా బరిలోకి దిగుతుందని ఆ పార్టీ పట్టణ శాఖ ఇంచార్జ్ ఆకుల రవీందర్ స్పష్టం చేశారు. మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడుతూ….కులమతాలకు అతీతంగా, అవినీతి రహిత రాజకీయాలను ప్రజలకు అందించడమే జనసేన లక్ష్యమని పేర్కొన్నారు. పట్టణంలోని ప్రతి వార్డులో సామాన్య ప్రజలకు ప్రభుత్వ ఫలాలు అందేలా చూడటమే తమ పార్టీ ముఖ్య ఉద్దేశమని తెలిపారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అడుగుజాడల్లో నడుస్తూ, క్షేత్రస్థాయిలో ప్రజల కష్టాలను తెలుసుకుని వారికి అండగా ఉంటాం అని ఆయన అన్నారు.అవినీతి రాజకీయాలకు చరమగీతం పాడుతూ, తాండూరు అభివృద్ధికి మున్సిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీని గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు కల్వ భాను ప్రకాష్, శశిధర్, అమ్రేష్, మ్యతరి వెంకట్, ఉదయ్ రెడ్డి, రమేష్, అశోక్ తదితరులు పాల్గొని తమ మద్దతు తెలిపారు.






