- పట్టణ సమస్యలపై ఆరా తీసిన మనోహర్ రెడ్డి
- మార్నింగ్ వాక్ చేస్తూ క్షేత్రస్థాయిలో పరిశీలన
జనవాహిని ప్రతినిధి తాండూరు : తాండూరు నియోజకవర్గ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి బుధవారం ఉదయం పట్టణంలో ఆకస్మికంగా పర్యటించారు. తన దైనందిన మార్నింగ్ వాక్‌లో పట్టణంలోని ప్రధాన రహదారులు, అంతర్గత వీధుల్లో కలియతిరుగుతూ పారిశుధ్య పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా విధుల్లో ఉన్న మున్సిపల్ పారిశుధ్య కార్మికులను పలకరించి, వారితో నేరుగా మాట్లాడారు.పట్టణంలో చెత్త సేకరణ సక్రమంగా జరుగుతుందా? లేదా? అని కార్మికులను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా డ్రైనేజీ క్లీనింగ్ విషయంలో ఎక్కడైనా తీవ్రమైన సమస్యలు ఉన్నాయా? మురుగునీరు నిలిచిపోయే ప్రాంతాలు ఏవైనా ఉన్నాయా? అని ఆరా తీశారు. అధికారుల నివేదికల కంటే క్షేత్రస్థాయిలో పనిచేసే కార్మికులకే సమస్యల మీద పూర్తి అవగాహన ఉంటుందని, అందుకే వారితో చర్చించి సమస్యలను తెలుసుకుంటున్నట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఇంతకుముందు తాండూరు పట్టణంలోని విలయమోన్ గ్రౌండ్లో మార్నింగ్ వాకర్ సభ్యులతో మాట ముచ్చట పెట్టారు. గ్రౌండ్ కు మార్నింగ్ వాక్ కోసం వచ్చిన అందరితో కలిసి స్థానికంగా ఉన్న సమస్యల గురించి, అడిగి తెలుసుకున్నారు. తాండూరు పట్టణంలో ఎక్కడ ఎలాంటి సమస్య ఉన్న దాన్ని పరిష్కరించేందుకు ఎల్లప్పుడూ కృషి చేస్తానని హామీ ఇచ్చారు.






