- వార్డు అభివృద్ధికి అంకితభావంతో పనిచేస్తా అభ్యర్థి శిరి చందన
- 36వ వార్డు అభివృద్ధికి అంకితం
- కౌన్సిలర్ అభ్యర్థిగా శిరి చందన నామినేషన్
జనవాహిని ప్రతినిధి తాండూరు : మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా 36వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న శిరి చందన శుక్రవారం నామినేషన్ దాఖాలు చేశారు. యువతకు రాజకీయాల్లో అవకాశం కల్పించి ప్రోత్సహిస్తున్న స్థానిక ఎమ్మెల్యేకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.న్యాయ పరిజ్ఞానంతో ప్రజా సేవవృత్తిరీత్యా న్యాయవాది అయిన శిరి చందన, తనకున్న చట్టపరమైన అవగాహనను ప్రజా సమస్యల పరిష్కారానికి ఉపయోగిస్తానని పేర్కొన్నారు. అభివృద్ధి అంటే మాటల్లో చెప్పడం కాదు.. చేసి చూపిస్తానన్నారు. యువత తలుచుకుంటే అద్భుతాలు సాధించగలరని, ఆ నమ్మకంతోనే ప్రజల ముందుకు వస్తున్నాను అని ఆమె ధీమా వ్యక్తం చేశారు.వార్డులోని ప్రతి గల్లీలో ఉన్న సమస్యలను స్వయంగా తెలుసుకుని, స్థానిక పెద్దల సలహాలు మరియు ఎమ్మెల్యే మార్గదర్శకత్వంలో వాటిని పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ప్రజా సమస్యలపై నిరంతరం అందుబాటులో ఉంటూ, 36వ వార్డును ఆదర్శవంతమైన వార్డుగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని స్పష్టం చేశారు.అనుకున్న లక్ష్యాలను కచ్చితంగా సాధిస్తామని, ప్రజలు తనను ఆశీర్వదించాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో వార్డు ప్రముఖులు మరియు కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు.






