- మాకు పాత జిల్లానే కావాలి: జిల్లా పునర్నిర్మాణ సాధన సమితి
- తాండూరు, వికారాబాద్,పరిగి కలపాలి
- 317 జీవో తో మాకు తీవ్ర నష్టం
- ఉద్యోగ,ఉపాధి అవకాశాలు కోల్పోతాం
జనవాహిని ప్రతినిధి తాండూరు : వికారాబాద్ జిల్లాలోని తాండూరు, పరిగి ,వికారాబాద్ నియోజకవర్గాలను మాతృ జిల్లా అయిన రంగారెడ్డి జిల్లాలో లేదా చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గంలో కలపాలని రంగారెడ్డి జిల్లా పునర్ నిర్మాణ సమితి కోరుకుంది. శనివారం రోజు తాండూర్ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిని కలిసి వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు మాడిశెట్టి తిరుపతి మాట్లాడుతూ…భౌగోళికంగా చారిత్రక నేపథ్యంగా రంగారెడ్డి జిల్లాకు ప్రత్యేకమైన స్థానంఉంది. అలాంటి రంగారెడ్డి జిల్లా నుండి తల్లి నుండి పిల్లను విడదీసినట్లుగా వికారాబాద్ జిల్లాలోని మూడు నియోజకవర్గాలను విడదీసి పూర్తిగా గ్రామీణ జిల్లాగా వికారాబాద్ జిల్లాగా అవతరించింది. దీనితో అభివృద్ధి కుంటుపడింది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లేకుండా పోయాయి. 317 జీవో ద్వారా ఉమ్మడి రంగారెడ్డిలో ఉన్న మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల నుండి అలాగే మహబూబ్నగర్ జిల్లాల నుండి 1000 మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులు వికారాబాద్ జిల్లాకు శాశ్వతంగా బదిలీ అయ్యారని, దీని ద్వారా ఇక్కడి నిరుద్యోగులకి వెయ్యి పోస్టులు నష్టం జరిగిందని పేర్కొన్నారు. అలాగే రీజనల్ రింగ్ రోడ్ ఆర్ఆర్ఆర్ బిందకు సొట్ట పడ్డట్లుగా వికారాబాద్ జిల్లా దగ్గరికి వచ్చేసరికి రింగ్ రోడ్డు వంకరగా పోతుంది.ఆ వంకరని సరి చేస్తే వికారాబాద్ టౌను రీజనల్ రింగ్ రోడ్ లోపల నుండి వస్తుంది. తద్వారా కార్పొరేట్ విద్యాసంస్థలు ఐటి కంపెనీలు వివిధ వాణిజ్య వ్యాపార కేంద్రాలు వెలవడంతోపాటు, ఇక్కడ పర్యాటక కేంద్రం కూడా అభివృద్ధి చెందుతుంది.పూర్తిగా గ్రామీణ జిల్లాగా ఉన్న వికారాబాద్ జిల్లా ప్రజలకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కలుగుతాయి. ఐటీ కారిడార్ గా ఉన్న గచ్చిబౌలి ప్రాంతంలో ట్రాఫిక్ సమస్య తగ్గి అభివృద్ధి అనేటువంటిది వేగవంతమవుతుంది. అలాగే రంగారెడ్డి జిల్లాలో వికారాబాద్ జిల్లా అని మళ్లీ కలిపినట్లయితే ఇక్కడి భూములకి విపరీతమైన రేటు వచ్చి ఇక్కడి ప్రజలు మరి ఆర్థికంగా ఎదిగే అవకాశం ఉంటుంది. రోడ్లు బాగుపడి రవాణా వ్యవస్థ వేగవంతంగా పుంజుకుంటుందని అన్నారు. దానికి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి స్పందిస్తూ మీది న్యాయమైన డిమాండ్ కచ్చితంగా సీఎం దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు మాడిపాటి తిరుపతి,జిల్లా ప్రధాన కార్యదర్శి నల్ల రమేష్, ఉపాధ్యక్షులు సాయి శ్రవణ్, అవినాష్, జ్ఞానేశ్వర్,సూర్య,మోహన్,నవీన్,హరీష్,వెంకటేష్,అక్షయ్ తదితరులు పాలగొన్నారు






