Saturday, January 31, 2026
Home NEWS బీసీ సర్పంచ్‌లకు అభినందన సభ.. సర్వం సిద్ధం.

బీసీ సర్పంచ్‌లకు అభినందన సభ.. సర్వం సిద్ధం.

0
4
  • రేపు వికారాబాద్‌లో బీసీల గర్జన..
  • సర్పంచ్‌లకు ఘన సన్మానం!
  • ​బీసీ నేతల మహా సమ్మేళనానికి సర్వం సిద్ధం
  • ​అతిథులుగా ఆర్. కృష్ణయ్య, ఈటెల రాజేందర్, వి.హనుమంతరావు
  • ​బీసీ హక్కుల రక్షణే లక్ష్యం, కందుకూరి రాజ్‌కుమార్ వెల్లడి

జనవాహిని ప్రతినిధి తాండూరు :- వికారాబాద్ జిల్లా కేంద్రంలో రేపు బీసీల ఐక్యతను చాటిచెప్పేలా భారీ బహిరంగ సభకు తెరలేవనుంది. పట్టణంలోని గౌలికర్ ఫంక్షన్ హాల్ వేదికగా శనివారం నూతనంగా ఎన్నికైన బీసీ సామాజికవర్గ సర్పంచ్‌లకు గౌరవప్రదంగా అభినందన సన్మాన కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ మేరకు జాతీయ బీసీ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్‌కుమార్ శుక్రవారం ఏర్పాట్లను పర్యవేక్షించి, సభ వివరాలను వెల్లడించారు.ఈ కార్యక్రమానికి పార్టీలకతీతంగా బీసీ ఉద్యమ నేతలు, రాజకీయ ప్రముఖులు తరలిరానున్నారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్. కృష్ణయ్య ముఖ్య అతిథిగా హాజరై దిశానిర్దేశం చేయనున్నారు. వీరితో పాటు మల్కాజ్‌గిరి ఎంపీ ఈటెల రాజేందర్, కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు, మాజీ స్పీకర్ సిరికొండ మధుసూదనా చారి, మాజీ చైర్మన్ స్వామి గౌడ్, బి. జ్ఞానేశ్వర్ ముదిరాజ్ వంటి దిగ్గజాలు ఈ వేదికపై ప్రసంగించనున్నారు.కేవలం సన్మానాలకే పరిమితం కాకుండా, ఈ సదస్సులో స్థానిక సంస్థల పాలనలో బీసీల ప్రాధాన్యతపై లోతైన చర్చ జరగనుంది.ఈ సందర్భంగా కందుకూరి రాజ్‌కుమార్ మాట్లాడుతూ.. బీసీలు కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే కాకుండా, పాలకులుగా ఎదగాలన్నదే ఈ సభ ముఖ్య ఉద్దేశమని అన్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నలుమూలల నుంచి, ముఖ్యంగా తాండూర్, వికారాబాద్, పరిగి, కొడంగల్ నియోజకవర్గాల నుంచి సర్పంచులు, వార్డు సభ్యులు, బీసీ బంధువులు వేల సంఖ్యలో తరలివచ్చి ఈ సన్మాన సభను చారిత్రాత్మక విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here