Wednesday, February 18, 2026

బిఎస్ఆర్ మార్గదర్శకత్వంలోనే మున్సిపల్ విజయం…! 

-

spot_img
  •  కృతజ్ఞతలు తెలిపిన చైర్‌పర్సన్ నీరజ, వైస్ చైర్మన్ అబ్దుల్ రజాక్
  •  బిఎస్ఆర్ దంపతులకు ఘన సన్మానం

జనవాహిని ప్రతినిధి తాండూరు : తాండూరు మున్సిపాలిటీలో సాధించిన విజయం బుయ్యని శ్రీనివాస్ రెడ్డి రాజకీయ వ్యూహాలకు, ఆయనపై ప్రజలకున్న నమ్మకానికి నిదర్శనమని నూతన మున్సిపల్ చైర్‌పర్సన్ నీరజ బాల్ రెడ్డి, వైస్ చైర్మన్ అబ్దుల్ రజాక్ పేర్కొన్నారు. బుధవారం బి. శ్రీనివాస్ రెడ్డి దంపతులను వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి, పుష్పగుచ్ఛాలతో సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో బిఎస్ఆర్ అందించిన ప్రోత్సాహం, మార్గదర్శకత్వం విజయానికి కీలకమని కొనియాడారు. ప్రజల ఆశీర్వాదంతో దక్కిన ఈ బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తామని, పట్టణాన్ని అన్ని రంగాల్లో ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామని వారు స్పష్టం చేశారు. అనంతరం…శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, రాజకీయాలకు అతీతంగా పట్టణ అభివృద్ధికి కట్టుబడి ఉండాలని సూచించారు. ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ, నిరంతరం అందుబాటులో ఉండి పనిచేయాలని ఆకాంక్షించారు. కొత్త చైర్‌పర్సన్, వైస్ చైర్మన్‌లకు తన సంపూర్ణ సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో నూతన కౌన్సిలర్ పోలీస్ బాలకృష్ణ రెడ్డి, సీనియర్ నాయకులు అబ్దుల్ రావూఫ్, పలువురు వార్డు ప్రతినిధులు, ముఖ్య నేతలు మరియు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

FOLLOW US

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe

Related Stories