Friday, April 3, 2026

ప్రశాంతతకు, అభివృద్ధికి కాంగ్రెస్‌ను గెలిపించండి

-

  • ప్రశాంతతకు, అభివృద్ధికి కాంగ్రెస్‌ను గెలిపించండి
  •  వార్డు నెం. 7, 8 కాలనీల్లో బుయ్యని శ్రీనివాస్ రెడ్డి ఎన్నికల ప్రచారం
  • ​పోలీస్ ఔట్ పోస్ట్, స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ ఏర్పాటుకు హామీ

జనవాహిని ప్రతినిధి తాండూరు : తాండూరు మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు బుయ్యని శ్రీనివాస్ రెడ్డి బుధవారం 7 వ వార్డ్ 8 పరిధిలోని ఎన్టీఆర్ కాలనీ, రాజీవ్ కాలనీ, ఇందిరమ్మ కాలనీల్లో ముమ్మరంగా పర్యటించారు. ఇంటింటికీ తిరుగుతూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్న ఆయన, కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించారు.​ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. రాజీవ్ కాలనీ మరియు ఇందిరమ్మ కాలనీల్లోని గృహాలు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే మంజూరయ్యాయని, పేదలకు గూడు కల్పించిన ఘనత తమ పార్టీదేనని గుర్తు చేశారు. ఎన్టీఆర్ కాలనీలో ఇప్పటికే మౌలిక వసతులు కల్పించామని, అధికార కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపితే కాలనీలను ఆదర్శంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు.కాలనీలో ప్రశాంత వాతావరణం నెలకొనేలా పోలీస్ ఔట్ పోస్ట్ ఏర్పాటు చేస్తామని, ఈ వార్డును తాండూరు పోలీస్ స్టేషన్ పరిధిలోకి తీసుకువస్తామని భరోసా ఇచ్చారు.యువత చెడు వ్యసనాలకు బానిసలు కాకుండా బాధ్యతాయుతంగా ఉండాలని పిలుపునిచ్చారు. యువతలో నైపుణ్యం పెంపొందించడానికి కాలనీలోనే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేస్తామన్నారు.వార్డుల అభివృద్ధి కేవలం కాంగ్రెస్‌తోనే సాధ్యమని, రాబోయే ఎన్నికల్లో హస్తం గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని ఆయన కోరారు. ఈ ప్రచార కార్యక్రమంలో పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు మరియు కాలనీ వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

FOLLOW US

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
spot_img

Related Stories