జనవాహిని పటాన్‌చెరు :- పటాన్‌చెరు పట్టణంలో శ్లోక విద్యాపీఠ్ స్కూల్‌ను బుధవారం ఘనంగా ప్రారంభించారు. గత పదేళ్లుగా విద్యా రంగంలో సేవలందిస్తున్న శ్లోక విద్యాపీఠ్ సంస్థ, ఐఐటి , నీట్ మరియు యూపీఎస్సీ వంటి పోటీ పరీక్షలకు విద్యార్థులను సిద్ధం చేస్తూ విశేష గుర్తింపు పొందింది.6వ తరగతి నుంచే శ్లోక ఫౌండేషన్ తరగతుల ద్వారా విద్యార్థులకు శిక్షణ అందిస్తూ, విద్యా మరియు పోటీ పరీక్షలకు అవసరమైన బలమైన పునాది వేస్తున్నట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఇప్పటివరకు అనేక మంది విద్యార్థులు వివిధ పోటీ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించారని పేర్కొన్నారు.రథ సప్తమి పర్వదినాన్ని పురస్కరించుకుని స్కూల్ ప్రారంభోత్సవాన్ని సంప్రదాయ పూజా కార్యక్రమాలతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రముఖులు, విద్యావేత్తలు, తల్లిదండ్రులు మరియు విద్యార్థులు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు.ప్రాంత విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు పోటీ పరీక్షలకు సమగ్ర శిక్షణ అందించడమే శ్లోక విద్యాపీఠ్ లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు.
విద్యారంగంలో దశాబ్దానికి పైగా విశిష్ట అనుభవంతో, ఎన్నో విజయవంతమైన విద్యార్థులను తీర్చిదిద్దిన స్లోక విద్యాపీఠ్ తన నూతన ప్రయాణాన్ని పటాన్‌చెరులో శుభకరమైన రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రారంభించింది.స్లోక విద్యాపీఠ్ సంస్థ నుంచి చదువుకున్న విద్యార్థులు ఐఐటీ, నీట్, యూపీఎస్సీ వంటి దేశంలోని అత్యంత ప్రతిష్టాత్మక పరీక్షల్లో విజయం సాధించడంతో పాటు, అనేక ఒలింపియాడ్ ర్యాంకులు కూడా సాధించి సంస్థకు మంచి పేరు తీసుకువచ్చారు.మన ప్రాచీన భారతీయ విలువలు, బలమైన పునాది నైపుణ్యాలను ఆధునిక సాంకేతికతతో సమన్వయం చేస్తూ విద్యాబోధన చేయడంలో స్లోక విద్యాపీఠ్ ప్రత్యేక గుర్తింపు పొందింది.ఈ సందర్భంగా పాఠశాల ప్రాంగణంలో ఘనంగా పూజా కార్యక్రమం నిర్వహించబడింది. ఈ ప్రారంభోత్సవ పూజా కార్యక్రమానికి పాఠశాల కారస్పాండెంట్ శ్రీ చంద్ర శేఖర్ రెడ్డి గారు, సెక్రటరీ మరియు మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ అస్సాన్ గారు, ప్రిన్సిపాల్ శ్రీ వేణుగోపాల్ రావు గారు, అలాగే పాఠశాల యాజమాన్యం హాజరయ్యారు.ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ వేణుగోపాల్ రావు గారు తల్లిదండ్రులు మరియు యాజమాన్యాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తూ, సామర్థ్యం, దూరదృష్టి మరియు నిబద్ధతతో విద్యార్థులను విజయపథంలో నడిపించే మైలురాయిగా స్లోక విద్యాపీఠ్ నిలుస్తుందని తెలిపారు.






