- 1వ వార్డులో జనసేన ‘గబ్బర్ సింగ్’ హంగామా!
- అగ్గనూర్ అనిత గెలుపు ఖాయమన్న శంకర్ గౌడ్
- తాండూరు వీధుల్లో ఇంటింటి ప్రచారం.. భారీగా తరలివచ్చిన జనం
జనవాహిని ప్రతినిధి తాండూరు : తాండూరు పురపాలక సంఘం పరిధిలోని 1వ వార్డులో ఎన్నికల ప్రచారం పీక్ స్టేజ్‌కు చేరుకుంది. జనసేన అభ్యర్థి అగ్గనూర్ అనితకు మద్దతుగా ఆ పార్టీ రాష్ట్ర ఇంచార్జ్ శంకర్ గౌడ్ ఆధ్వర్యంలో ‘గబ్బర్ సింగ్ గ్యాంగ్’ చేసిన హంగామాతో వార్డు దద్దరిల్లింది. సినిమా స్టైల్‌లో గబ్బర్ సింగ్ గ్యాంగ్ సభ్యులు వీధుల్లో తిరుగుతూ ప్రజలను ఆకట్టుకోవడంతో ప్రచార పర్వం కొత్త పుంతలు తొక్కింది.వార్డులోని ప్రతి ఇంటికి తిరుగుతూ జనసేన పార్టీ సిద్ధాంతాలను, అభ్యర్థి అనిత చేపడతానన్న అభివృద్ధి పనులను శంకర్ గౌడ్ వివరించారు. ముఖ్యంగా 1వ వార్డుకు చెందిన సిరి యాదవ్ కుటుంబం అగ్గనూర్ అనితకు సంపూర్ణ మద్దతు ప్రకటించడం గమనార్హం. స్థానిక సమీకరణాలు కూడా అనితకు అనుకూలంగా ఉండటంతో భారీ మెజారిటీ ఖాయమని పార్టీ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.ప్రచారంలో శంకర్ గౌడ్ మాట్లాడుతూ.. వార్డు సమస్యల పరిష్కారం కోసం నిరంతరం శ్రమించే అగ్గనూర్ అనితను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. వార్డ్ అభివృద్ధి కోసం, తాండూరు కోసం ఎన్ఆర్ఐ ఫండ్స్ కూడా అందుబాటులో ఉందని, ప్రతి సమస్యకి పరిస్కారం చెప్పడతామని తెలిపారు. గబ్బర్ సింగ్ గ్యాంగ్ సభ్యుల రాకతో యువతలో ఉత్సాహం ఉరకలెత్తింది. ఈ కార్యక్రమంలో పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు మరియు వార్డు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.






