- తాండూరు ఫ్లైఓవర్‌పై రోడ్డు ప్రమాదం
- కారు ఢీకొని బైక్ నడుపుతున్న వ్యక్తి మృతి
జనవాహిని ప్రతినిధి తాండూరు: పట్టణంలోని ఫ్లైఓవర్ బ్రిడ్జిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మరణించారు. ఓవర్‌టేక్ చేసే క్రమంలో కారు అదుపుతప్పి బైక్‌ను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది.స్థానికుల కథనం ప్రకారం.. ఫ్లైఓవర్ బ్రిడ్జిపై ఒక కారు తన ముందున్న వాహనాన్ని ఓవర్‌టేక్ చేసేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలో కారు ఎదురుగా వస్తున్న బైక్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ పై ఉన్న వ్యక్తి తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.ప్రస్తుతం మృతుడి మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే, మరణించిన వ్యక్తికి సంబంధించిన ఎలాంటి అడ్రస్ లేదా ఇతర వివరాలు ఇంకా తెలియరాలేదు. ఆయన ఎవరు? ఎక్కడి నుంచి వస్తున్నారు? అనే కోణంలో ఆరా తీస్తున్నారు.






