- తాండూరు మున్సిపల్ పీఠం కాంగ్రెస్‌దే..!
- నలుగురు అభ్యర్థుల భారీ మెజారిటీ ఖాయం
- 11వ వార్డు నుంచి బంటు వేణుగోపాల్ నామినేషన్
జనవాహిని ప్రతినిధి తాండూరు : తాండూరు మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరడం ఖాయమని, పార్టీ అభ్యర్థులందరూ భారీ మెజారిటీతో విజయం సాధించబోతున్నారని 11వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి బంటు వేణుగోపాల్ ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం ఆయన తాండూరు మున్సిపల్ కార్యాలయంలో తన నామినేషన్ పత్రాలను సమర్పించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ.. తాండూరు పట్టణం దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీకి కంచుకోట అని గుర్తుచేశారు. మున్సిపాలిటీ పరిధిలోని 9, 10, 11, 12 వార్డుల నుంచి కాంగ్రెస్ తరఫున బలమైన అభ్యర్థులు బరిలో ఉన్నారని తెలిపారు. 9వ వార్డు నుంచి చైతన్య ప్రశాంత్, 10వ వార్డు నుంచి అల్లాపూర్ శ్రీకాంత్, 11వ వార్డు నుంచి వేణుగోపాల్, 12వ వార్డు నుంచి నీరజ పోటీ చేస్తున్నట్లు వెల్లడించారు. ఎల్లప్పుడు ప్రజల మధ్యనే ఉంటూ వారి సమస్యలపై పోరాడుతున్నా అని అన్నారు. ప్రజలకు ఏ కష్టం వచ్చినా, ఎప్పుడు ఫోన్ చేసినా తక్షణమే స్పందించి అందుబాటులో ఉంటున్నానని వేణుగోపాల్ పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో 11వ వార్డు ప్రజలు తనను ఆశీర్వదించి, భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన కోరారు. తాండూరు మున్సిపల్ పీఠాన్ని దక్కించుకోవడం ద్వారా పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.






