Saturday, March 14, 2026
spot_img

కారు’ గుర్తుకే ఓటు వేయండి…!

-

spot_img
spot_img
  • కారు గుర్తుకు ఓటు వేసి.. ఫాతిమాను భారీ మెజారిటీతో గెలిపించండి
  • ​ 35వ వార్డులో ఎన్నికల ప్రచారం నిర్వహించిన పైలెట్ రోహిత్ రెడ్డి

జనవాహిని ప్రతినిధి తాండూరు : మున్సిపల్ ఎన్నికల ప్రచార పర్వం తాండూరులో ఊపందుకుంది. శనివారం పట్టణంలోని 35వ వార్డులో బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు, మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా వార్డు కౌన్సిలర్ అభ్యర్థి ఫాతిమా సఫియా ఆసిఫ్ కు మద్దతుగా ఆయన ఇంటింటికీ వెళ్లి ఓటర్లను అభ్యర్థించారు.ప్రచారంలో భాగంగా రోహిత్ రెడ్డి మాట్లాడుతూ.. తాండూరు పట్టణ సమగ్ర అభివృద్ధి బీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమన్నారు. వార్డులోని ప్రతి గల్లీలో మౌలిక వసతుల కల్పనకు తమ పార్టీ కట్టుబడి ఉందని, ప్రజా సమస్యలను పరిష్కరించే సమర్థత ఫాతిమా సఫియా ఆసిఫ్ కు ఉందని ఆయన కొనియాడారు.వార్డు ప్రజలందరూ ఏకతాటిపై నిలిచి, కారు గుర్తుకు తమ అమూల్యమైన ఓటు వేసి ఫాతిమాను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి చేరాలంటే బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపు అవసరమని పేర్కొన్నారు.

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

FOLLOW US

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe

Related Stories