- వార్డు అభివృద్ధి నా లక్ష్యం
- విద్యావంతుడు బరిలో ఉంటేనే సమస్యలకు పరిష్కారం
- తాండూరు 6వ వార్డు అభ్యర్థిగా పోటీకి సిద్ధం
- అధ్వాన్నమైన డ్రైనేజీ వ్యవస్థపై ధ్వజం
- బీజేపీ యువ నేత భవాని రామ్ చారీ
జనవాహిని ప్రతినిధి తాండూరు : తాండూరు మున్సిపల్ ఎన్నికల సందర్బంగా బరిలోకి యువకులు ఉత్సహని చూపుతున్నారు. ఈ నేపథ్యంలో పట్టణంలోని 6వ వార్డు (ఇందిరా నగర్) రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. యువకుడు,నిరంతరం ప్రజల సమస్యలపై అవగాహన కలిగి ఉండే ఉత్సాహవంతుడైన భవాని రామ్ చారీ భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. పార్టీ అధిష్టానం అవకాశం కల్పిస్తే 6వ వార్డులో బీజేపీ జెండా ఎగురవేయడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.సాధారణ రాజకీయ నాయకులకు భిన్నంగా, వార్డులోని ప్రతి సమస్యపై పూర్తి స్థాయి ‘సబ్జెక్ట్’ ఉన్న వ్యక్తిగా భవాని రామ్ చారీ నిలుస్తున్నారు. ఇందిరా నగర్ ప్రాంతంలో దశాబ్దాలుగా వేధిస్తున్న డ్రైనేజీ వ్యవస్థను ఆయన ప్రధానాంశంగా తీసుకున్నారు. తాను గెలిస్తే శాశ్వత పరిష్కారం చూపిస్తానని స్పష్టం చేశారు.వార్డును మోడల్ వార్డుగా మార్చేందుకు ఆయన తన విజన్‌ను ప్రకటించారు, మహిళల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని వార్డులో అదనంగా రెండు బాత్రూంల నిర్మాణం చేసేందుకు కృషి చేస్తానని, వృద్ధులు, పేదల ఆరోగ్యం కోసం వార్డు పరిధిలోనే తరచుగా ఉచిత వైద్య శిబిరాల ఏర్పాటు చేస్తానాని వెల్లడించారు. వార్డులోని రెండు మున్సిపల్ పార్కులను పిల్లలకు, పెద్దలకు అనుకూలంగా తీర్చిదిద్ది, ఆహ్లాదకరమైన పచ్చదనాన్ని సృష్టించడంపై శ్రద్ధ వహిస్తానని తెలిపారు. ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీరు అందేలా ప్రణాళికాబద్ధమైన చర్యలు చేస్తామని,ఒక యువకుడు రాజకీయాల్లోకి రావడం వల్ల మార్పు సాధ్యమని స్థానిక యువత భావిస్తోంది. వార్డులోని ప్రతి చిన్న సమస్యను సైతం విస్మరించకుండా తీర్చిదిద్దుతానని ఆయన హామీ ఇచ్చారు. తాండూరు మున్సిపాలిటీలో బీజేపీ సాధించబోయే విజయాలకు 6వ వార్డు నుండే శ్రీకారం చుడతామని భవాని రామ్ చారీ ఈ సందర్భంగా ధీమా వ్యక్తం చేశారు.






