
- అమ్ముడుపోయిన చరిత్ర నీది.. అభివృద్ధి చేసే తత్వం మా ఎమ్మెల్యేది!
- మాజీ కౌన్సిలర్ హాసీఫ్‌పై కాంగ్రెస్ నాయకుడు షేక్ మౌజామ్ నిప్పులు
- రెండేళ్లలోనే తాండూర్‌కు ఎన్నో పదవులు వచ్చాయి
- దమ్ముంటే అభివృద్ధిపై చర్చకు రావాలని సవాల్
జనవాహిని ప్రతినిధి తాండూరు : మున్సిపల్ ఎన్నికల ముందు తన ఉనికిని చాటుకోవడానికి మాజీ కౌన్సిలర్ ఆసీఫ్ సోషల్ మీడియాలో కాంగ్రెస్ పార్టీపై, ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి పై చేస్తున్న అసత్య ప్రచారాలను 28వ వార్డ్ కాంగ్రెస్ యువ నాయకులు షేక్ మౌజామ్ తీవ్రంగా ఖండించారు.
ఈ సందర్బంగా….ముస్లింలకు కాంగ్రెస్ ద్రోహం చేసిందని మాట్లాడే ఆసీఫ్‌కు ముస్లింల గురించి మాట్లాడే అర్హత లేదని మౌజామ్ మండిపడ్డారు. గతంలో ముస్లిం అభ్యర్థికి చైర్మన్ అయ్యే అవకాశం వస్తే, డబ్బు సంచులకు అమ్ముడుపోయి ఆ అవకాశాన్ని కాలరాసిన చరిత్ర నీది కాదా? అని ప్రశ్నించారు. సొంత పార్టీ టౌన్ ప్రెసిడెంట్ ఎవరో తెలియని మీరు, కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తే ప్రజలు నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. గత ఎమ్మెల్యే ఐదేళ్లలో చేయని పనులను బుయ్యని మనోహర్ రెడ్డి కేవలం రెండేళ్లలోనే చేసి చూపించారని మౌజామ్ గుర్తు చేశారు. పదవుల విషయంలో తాండూర్‌కు కాంగ్రెస్ పెద్ద పీట వేసిందని చెబుతూ.. ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్, ఫైనాన్స్ కార్పొరేషన్ మెంబర్, జిల్లా మత్స్యశాఖ చైర్మన్, డీసీసీబీ వైస్ చైర్మన్ వంటి పదవులు ఈ రెండేళ్లలోనే వచ్చాయని వివరించారు.సోషల్ మీడియాలో అబద్ధాలు ప్రచారం చేయడం మానుకోవాలని, అభివృద్ధిపై చర్చించే ధైర్యం ఉంటే మాజీ ఎమ్మెల్యేను తీసుకొని రావాలని సవాల్ విసిరారు. ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి గారి సవాల్‌ను స్వీకరించి, ముఖాముఖి చర్చకు రావాలని ఆయన డిమాండ్ చేశారు.



