
- 3వ వార్డు ఓటర్ల జాబితాలో అక్రమాలు..
- రిజర్వేషన్ల కొరకే అక్రమ ఓట్లు
- తాండూరు వికారాబాద్ జిల్లా కలెక్టర్, ఆర్డీఓకు ఫిర్యాదు
జనవాహిని ప్రతినిధి తాండూరు : తాండూరు మున్సిపాలిటీ పరిధిలోని 3వ వార్డు ఓటర్ల జాబితా తయారీలో భారీగా అక్రమాలు చోటుచేసుకుంటున్నాయని, స్థానికేతరులను ఓటర్లుగా చేరుస్తూ ఎన్నికల నిబంధనలను ఉల్లంఘిస్తున్నారని వార్డు నివాసి మహ్మద్ అమ్జాద్ ఆరోపించారు. ఈ మేరకు ఆయన గురువారం వికారాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో, తాండూరు ఆర్డీఓ, తహశీల్దార్‌కు ఫిర్యాదు చేశారు.రాబోయే మున్సిపల్ ఎన్నికల దృష్ట్యా, ఇప్పటికే ఎన్నికలు ముగిసిన ఇతర గ్రామాల ఓటర్లను ప్రలోభపెట్టి, వారి పేర్లను 3వ వార్డు ఓటర్ల జాబితాలో అక్రమంగా చేరుస్తున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. వార్డు రిజర్వేషన్ కొరికు,రాజకీయ లబ్ధి కోసమే కొందరు ఈ తరహా అక్రమాలకు పాల్పడుతున్నారని, దీనివల్ల స్థానిక ఓటర్ల ప్రాధాన్యత తగ్గే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.ఈ వ్యవహారంపై వార్డు ప్రజలు, వివిధ రాజకీయ పార్టీల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓటర్ల జాబితాను క్షేత్రస్థాయిలో మరోసారి క్షుణ్ణంగా పరిశీలించాలని, కేవలం అర్హులైన స్థానిక నివాసితులకే ఓటు హక్కు కల్పించాలని వారు డిమాండ్ చేశారు. అక్రమంగా చేర్చిన ఓట్లను తక్షణమే తొలగించి, ఎన్నికలు పారదర్శకంగా, నిష్పాక్షికంగా జరిగేలా చూడాలని అధికారులను కోరారు.



