Wednesday, May 27, 2026

― Advertisement ―

అంగన్వాడీ పంపిణీలో ‘నిర్లక్ష్య’పర్వం…!

సకాలంలో అందని రేషన్.. ఆగ్రహం వ్యక్తం చేస్తున్న అన్నసాగర్ గ్రామస్తులు టీచర్‌ను విధుల నుంచి తొలగించాలని డిమాండ్ జనవాహిని ప్రతినిధి తాండూరు : వికారాబాద్ జిల్లా, యాలాల మండలంలోని అన్నసాగర్ గ్రామంలో అంగన్వాడీ...
spot_img
  • ఓటర్ల జాబితాలో గందరగోళం..! 
  • దాదాపు 200లకు పైగా బోగస్ ఓట్లు నమోదు 
  • 1వ వార్డ్ ఓటర్ జాబితా ను సవరించాలి 
  •  ఫిర్యాదు చేసిన అభ్యర్థి సిరి యాదవ్ 

జనవాహిని ప్రతినిధి తాండూరు : తాండూరు మున్సిపల్ ఎన్నికల ఓటర్ల జాబితాలో గందరగోళం ఏర్పడిందని యువనాయకుడు సిరి యాదవ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. 1వ వార్డ్ మాల్రెడ్డి పల్లి లో ఇతర వార్డ్ కు చెందిన ఓట్లు నమోదు అయ్యాయని, వార్డ్ లో ఓట్లు కూడా అధికంగా పెరిగినట్టు తెలిపారు. సుమారు 200లకు పైగా దొంగ ఓట్లు 1 వ వార్డ్ లో నమోదైనట్లు గా పేర్కొన్నారు. అధికారులు వెంటనే స్పందించి బోగస్ ఓట్లను తొలగించాలని కోరారు. ఏ వార్డుకు చెందిన ఓటర్లు అదే వార్డులో ఉండేలా పారదర్శకత పాటించాలని, తుది జాబితా ప్రకటన నాటికి ఈ సమస్యలను అన్నింటిని పరిష్కరించాలని కోరారు.