Sunday, March 15, 2026

శ్రీనివాస్ రెడ్డిని కలిసిన ఏఎంసీ చైర్మన్…!

-

spot_img
  • శ్రీనివాస్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన ఏఎంసీ నూతన చైర్మన్
  • నర్సిములు దంపతుల కృతజ్ఞతలు.

జనవాహిని ప్రతినిధి తాండూరు : తాండూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ (ఏఎంసీ) నూతన చైర్మన్‌గా నియమితులైన పట్లోళ్ల నర్సిములు, శనివారం ప్రముఖ నాయకులు బుయ్యని శ్రీనివాస్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిశారు. తన భార్య రత్నమాలతో కలిసి వెళ్లిన నర్సిములు, శ్రీనివాస్ రెడ్డి కి పుష్పగుచ్ఛం అందజేసి కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ సందర్భంగా శ్రీనివాస్ రెడ్డి నూతన చైర్మన్ దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతూ, మార్కెట్ కమిటీ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించాలని ఆకాంక్షించారు. ముఖ్యంగా రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ, మార్కెట్ యార్డులో రైతులకు ఎదురయ్యే సమస్యలను పరిష్కరించేందుకు నిరంతరం కృషి చేయాలని ఆయన సూచించారు.అనంతరం పట్లోళ్ల నర్సిములు మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో ఈ బాధ్యతను అప్పగించిన పెద్దలకు, సహకరించిన నాయకులకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని తెలిపారు. తాండూరు మార్కెట్ కమిటీ అభివృద్ధికి, రైతుల మేలు కోసం అందరినీ సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతానని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ముఖ్య నాయకులు, కార్యకర్తలు మరియు మార్కెట్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

FOLLOW US

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe

Related Stories