- తాండూరు కాంగ్రెస్‌లో ‘సంపత్’ పర్వం సమాప్తం..
- వంచన రాజకీయాలకు స్వస్తి..
- స్పష్టమైన ఆధిపత్యం దిశగా హస్తం పార్టీ
- న్యాయవాది నర్సింగ్ రావు వెల్లడి
జనవాహిని ప్రతినిధి తాండూరు : తాండూరు కాంగ్రెస్ రాజకీయాల్లో గత కొంతకాలంగా సాగుతున్న ‘డబుల్ గేమ్’కు తెరపడిందని నర్సింగ్ రావు పేర్కొన్నారు. పార్టీలో ఉంటూనే వెన్నుపోటు రాజకీయాలకు తెరలేపారనే విమర్శలు ఎదుర్కొంటున్న డాక్టర్ సంపత్ కుమార్ నిష్క్రమణతో నియోజకవర్గ కాంగ్రెస్‌లో ఒక్కసారిగా రాజకీయ వాతావరణం తేలికపడిందన్నారు. ఆయన నిష్క్రమణను ‘రాజకీయ ప్రక్షాళన’గా అభివర్ణిస్తున్న పార్టీ శ్రేణులు, ఇకపై స్వచ్ఛమైన, విలువలతో కూడిన రాజకీయాలకు తాండూరు వేదిక కాబోతోందని ఆరోపించారు. ఈ సందర్బంగా నర్సింగ్ రావు మాట్లాడుతూ… అసెంబ్లీ ఎన్నికల క్లిష్ట సమయంలో పార్టీకి అండగా ఉండాల్సింది పోయి, తెరచాటు ఒప్పందాలతో కాంగ్రెస్‌కు తూట్లు పొడిచేందుకు సంపత్ ప్రయత్నించారని ఆయన ధ్వజమెతన్నారు. ఆయన కుట్రల గురించి అధిష్టానానికి ఫిర్యాదులు అందిన, పెద్ద మనసుతో కాంగ్రెస్ పార్టీ ఆయన కుటుంబానికి అండగా నిలిచిందన్నారు. సంపత్ కుమార్ సతీమణి సునీతా సంపత్ కు రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పదవి ఇచ్చి గౌరవించినా, సంపత్ కుమార్ తీరులో మార్పు రావడం లేదన్నారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను దెబ్బతీసేందుకు సంపత్ కుమార్ పక్కా స్కెచ్ వేశారని, ఆయన నీడలా వెన్నంటే ఉన్న ముఖ్య అనుచరులే ఆయన అసలు నైజాన్ని గ్రహించి తిరుగుబావుటా ఎగురవేశాని విమర్శించారు. రాజకీయ ముసుగును తొలగిస్తూ, తాండూరు ప్రజల ముందు ఆయన చేస్తున్న మురికి రాజకీయాలను బహిర్గతం చేసారని ఘాటుగా విమర్శలు చేశారు. బుయ్యని సోదరులు ఆయనకు పూర్తి రాజకీయ స్వేచ్ఛను ప్రసాదించారన్నారు. దాంతో స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి నర్సింగ్ రావు పేర్కొన్నారు. రెండు పడవల మీద ప్రయాణం చేస్తూ, రహస్య అజెండాలతో ప్రజలను మోసం చేసే నాయకులకు రాజకీయాల్లో ఉండే అర్హత లేదని చెప్పుకొచ్చారు. అలాంటి నాయకులు విశ్రాంతి తీసుకోవడమే ఉత్తమమని అన్నారు. సంపత్ నిష్క్రమణతో తాండూరు కాంగ్రెస్‌లో గందరగోళం తొలగిపోయిందని, ఇకపై తిరుగులేని మెజారిటీతో ముందుకు సాగుతామని నర్సింగ్ రావు ధీమా వ్యక్తం చేస్తున్నారు.






