- తాండూరు బాహుబలి” – గజాల స్టైల్ లో
- లారీకి ‘బ్రేక్’ వేసిన మందుబాబు..
- తాండూరు రోడ్డుపై 40 నిమిషాల నాన్-స్టాప్ ఎంటర్టైన్మెంట్!
జనవాహిని ప్రతినిధి తాండూరు : సినిమాల్లో హీరోలు విలన్ల కార్లను ఆపడం చూసుంటారు.. కానీ మన తాండూరు ‘మందుబాబు’ మాత్రం ఏకంగా కాంక్రీట్ మిక్సర్ లారీకే చుక్కలు చూపించాడు! ఫుల్లుగా ‘లోడ్’ ఎక్కించుకున్న ఈ బాహుబలి, బస్టాండ్ రోడ్డుపై వెళ్తున్న లారీకి అడ్డంగా నిలబడి, “నేను తప్పుకోను.. నిన్ను వెళ్లనివ్వను” అంటూ భీష్మించుకు కూర్చున్నాడు. లారీ డ్రైవర్ హారన్ కొడుతుంటే.. “మ్యూజిక్ బాగుంది.. ఇంకోసారి కొట్టు” అన్నట్టుగా అక్కడే 40 నిమిషాల పాటు ఫిక్సైపోయాడు. డ్రైవర్ రిక్వెస్ట్ చేసినా, జనం కేకలు వేసినా.. “నీ లారీ స్పీడా? నా మత్తు స్పీడా?” అన్నట్టుగా దాదాపు ముప్పావు గంట పాటు లారీ ని స్తంభింపజేశాడు. చివరికి ఎవరో వచ్చి పక్కకు లాగడంతో గానీ.. ఆ ‘మహానుభావుడి’ ధర్నా ముగియలేదు.మొత్తానికి ఈ ‘మందుబాబు’ దెబ్బకు లారీ డ్రైవర్‌కు చమటలు పట్టాయి, చూసేవాళ్లకు మాత్రం కడుపుబ్బ నవ్వు వచ్చింది!



