
- సావిత్రిబాయి పూలే చిత్రపటానికి ఘనంగా నివాళులు
- దేశపు తొలి మహిళా ఉపాధ్యాయురాలిని స్మరించుకున్న ప్రైవేట్ లెక్చరర్ల ఫోరం
- నివాళులు అర్పించిన శ్రీనివాస్ రెడ్డి
జనవాహిని ప్రతినిధి తాండూరు : భారతదేశపు మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే జయంతిని పురస్కరించుకుని, తాండూరు ప్రైవేట్ లెక్చరర్ ఫోరం ఆధ్వర్యంలో జాతీయ మహిళా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. శనివారం జరిగిన ఈ కార్యక్రమంలో ఫోరం సభ్యులు మరియు బుయ్యని శ్రీనివాస్ రెడ్డి పాల్గొని సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా బుయ్యని శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. భారతదేశంలో స్త్రీ విద్యకు సావిత్రిబాయి పూలే ఆద్యురాలని కొనియాడారు. అణచివేతకు గురైన వర్గాల కోసం, మహిళల చదువు కోసం ఆమె చేసిన పోరాటం మరువలేనిదన్నారు. సమాజంలో మహిళలు చదువుకుంటేనే అన్ని రంగాల్లో అభివృద్ధి సాధ్యమవుతుందని, సావిత్రిబాయి పూలేను ఆదర్శంగా తీసుకుని నేటి మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని ఆయన ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో ప్రైవేట్ లెక్చరర్ ఫోరం సభ్యులు, నాయకులు పాల్గొని సావిత్రిబాయి పూలే సేవలను స్మరించుకున్నారు.



