రాముని గుడికి 1లక్ష విరాళం ..!

- అందించిన తాండూరు మార్కెట్ కమిటీ చైర్మన్ బాల్ రెడ్డి
- శరవేగంగా ఆలయ పునర్నిర్మాణ పనులు
- దాతలు ముందుకు రావాలని కమిటీ సభ్యుల విజ్ఞప్తి
జనవాహిని ప్రతినిధి తాండూరు: పట్టణంలోని ఇందిరా నగర్‌లో శరవేగంగా జరుగుతున్న శ్రీ రామ మందిరం పునర్నిర్మాణ పనులకు మార్కెట్ కమిటీ చైర్మన్ పట్లోళ్ల బాల్రెడ్డి తమ వంతు సహాయంగా లక్ష రూపాయల విరాళాన్ని ప్రకటించి దాతృత్వాన్ని చాటుకున్నారు.ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఇందిరా నగర్ శ్రీ రామ మందిరం పునర్నిర్మాణ పనులు ప్రస్తుతం వేగవంతంగా సాగుతున్నాయి. ముఖ్యంగా, భక్తుల కొంగుబంగారమైన ఆలయ గర్భగుడి పనులు కూడా శరవేగంగా సాగుతుండటం విశేషం. ఆలయాన్ని అత్యంత సుందరంగా, భక్తుల మనోభీష్టానికి అనుగుణంగా తీర్చిదిద్దేందుకు ఆలయ కమిటీ సభ్యులు కృషి చేస్తున్నారు. ఈ పునర్నిర్మాణానికి ఆర్థిక సహకారం ఎంతో అవసరం కాగా, మార్కెట్ కమిటీ చైర్మన్ బాల్రెడ్డి లక్ష రూపాయల విరాళం పనులకు మరింత ఊపునిచ్చింది.ఈ సందర్భంగా రామ మందిరం కమిటీ సభ్యులు మాట్లాడుతూ… శ్రీరామచంద్రుని ఆలయ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు.రామలయానికి ఆర్థికంగా విరాళాలు అందించే భక్తులు, దాతలు ముందుకు వచ్చి ఆలయం అభివృద్ధికి, పునర్నిర్మాణానికి మీ వంతు సహకారాన్ని అందించాలన్నారు. మీ దాతృత్వం శ్రీరాముని సేవలో చిరస్మరణీయం అవుతుంది” అని కమిటీ సభ్యులు కోరారు. రామమందిర నిర్మాణం విజయవంతంగా పూర్తి కావడానికి భక్తులు, స్థానికులు కలిసికట్టుగా కృషి చేయాలని వారు పిలుపునిచ్చారు. అదేవిదంగా రామ మందిరానికి 1లక్ష విరాళంగా ఇచ్చిన తాండూరు మార్కెట్ కమిటీ చైర్మన్ బాల్రెడ్డి కి ధన్యవాదలు తెలిపారు.



