తెలంగాణ పంచాయతీ ఎన్నికల తుది షెడ్యూల్ విడుదల!

- ఎన్నికల సంఘం నోటిఫికేషన్డి
- డిసెంబర్ నెలలో మూడు దఫాలు
- నామినేషన్ల ఘట్టం నవంబర్ నెలాఖరు నుండి మొదలు
తాండూరు జనవాహిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలకు సంబంధించి మూడు విడతల షెడ్యూల్‌ను మంగళవారం అధికారికంగా విడుదల చేసింది. ఎన్నికల కమిషనర్ వెల్లడించిన ప్రకారం, పోలింగ్ డిసెంబరు నెలలో జరుగుతుంది, నామినేషన్ల ప్రక్రియ నవంబర్ నెలాఖరు నుండి ప్రారంభమవుతుంది.
మూడు విడతలు ఎప్పుడంటే?
ఎన్నికలు నిర్వహించే తేదీలు : విడత (ఫేజ్) పోలింగ్ తేదీ మొదటి విడత డిసెంబర్ 11 రెండవ విడత డిసెంబర్ 14 మూడవ విడత డిసెంబర్ 17 మొదటి ఫేజ్ నామినేషన్ల నవంబర్ 27రెండవ ఫేజ్ నామినేషన్ల నవంబర్ 30మూడవ విడత నామినేషన్లు డిసెంబర్ 03ప్రకటిత షెడ్యూల్ ప్రకారం, నామినేషన్ల ప్రక్రియ పూర్తయిన వెంటనే ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేయనున్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది.



