కిలోన్నర పైగా గంజాయి సీజ్…!

- తాండూరులో గంజాయి స్వాధీనం
- ఒకరి అరెస్ట్
- బీదర్ నుండి తాండూరుకు గంజాయి స్మగ్లింగ్..
జనవాహిని ప్రతినిధి తాండూరు : తాండూరు పట్టణంలో పోలీసులు జరిపిన ఆకస్మిక తనిఖీల్లో గంజాయి పట్టుబడింది. సోమవారం ఉదయం రైల్వే స్టేషన్ సమీపంలో జరిపిన ఈ దాడుల్లో సుమారు 1800 గ్రాముల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకుని, ఒక వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు తాండూరు డి.ఎస్.పి శ్రీ నర్సింగ్ యాదయ్య ఓ ప్రకటన లో వెల్లడించారు.
వివరాల్లోకి వెళితే..నమ్మదగిన సమాచారం మేరకు తాండూరు సబ్ ఇన్స్పెక్టర్ అంబ్రయ్య మరియు సిబ్బంది కలిసి సోమవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో రైల్వే స్టేషన్ పరిసరాల్లో తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో అనుమానాస్పదంగా కనిపించిన మహమ్మద్ షకిల్ పాషా (30) అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించారు.మహమ్మద్ షకిల్ పాషా, తండ్రి కాజా మొయినుదీన్.కూరగాయల వ్యాపారి.ప్రస్తుత నివాసం మలక్ పేట (హైదరాబాద్), స్థానిక నివాసం పటేల్ బగీచ (సీతారాంపేట, తాండూరు).నిందితుడిని విచారించగా, ఈ గంజాయిని కర్ణాటకలోని బీదర్ పట్టణం ఇరాని గల్లి నుండి కొనుగోలు చేసి తీసుకువచ్చినట్లు ఒప్పుకున్నాడు. స్వాధీనం చేసుకున్న 1.8 కిలోల గంజాయి విలువ మార్కెట్లో సుమారు రూ. 52,000/- ఉంటుందని పోలీసులు అంచనా వేశారు.నిందితునిపై ఎన్డిపీఎస్ (మత్తు పదార్థాల నిరోధక చట్టం) కింద కేసు నమోదు చేశారు. గంజాయి సరఫరా మరియు విక్రయాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా డిఎస్పీ హెచ్చరించారు.



