
- శ్రీరామమందిర పునర్ నిర్మాణానికి దాతల చేయూత
- మందిర పునర్నిర్మాణానికి ‘క్యాటరింగ్ అశోక్’ విరాళం
జనవాహిని ప్రతినిధి తాండూరు : తాండూరు పట్టణంలోని పురాతన శ్రీరామమందిర పునర్ నిర్మాణ పనులు భక్తుల సహకారంతో వేగంగా కొనసాగుతున్నాయి. ఆలయ పునర్నిర్మాణానికి భక్తులు తమవంతుగా ఆర్థిక, వస్తు రూపంలో చేయూతను అందిస్తున్నారు. ఈ క్రమంలో పట్టణానికి చెందిన ప్రముఖ క్యాటరింగ్ వ్యాపారి పి. అశోక్ తన ఉదారతను చాటుకున్నారు.గురువారం ఆలయ కమిటీ సభ్యులను కలిసిన అశోక్, దేవాలయంలో నిర్మించే ఫ్లోరింగ్ పనుల కోసం రూ. 51,116/- విరాళాన్ని అందజేశారు. కేవలం ఆర్థిక సాయమే కాకుండా, ఆలయ పునర్ నిర్మాణం అనంతరం నాలుగు రోజుల పాటు నిర్వహించే విగ్రహ ప్రతిష్ఠాపన ఉత్సవాల్లో భక్తులందరికీ అన్నదానం చేసే బాధ్యతను తానే స్వీకరిస్తున్నట్లు ప్రకటించారు.అంతేకాకుండా, ఉత్సవాల సమయంలో దేవాలయానికి అవసరమైన విద్యుత్ బెల్, మరియు సౌండ్ సిస్టంను కూడా ఉచితంగా సమకూరుస్తానని ఆయన హామీ ఇచ్చారు.అశోక్ చేసిన ఈ గొప్ప సాయానికి ఆలయ కమిటీ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. లోక కళ్యాణార్థం జరుగుతున్న ఈ ఆలయ పునర్నిర్మాణ యజ్ఞంలో భక్తులు, దాతలు ఇంకా పెద్ద సంఖ్యలో ముందుకు వచ్చి తమ శక్తి మేరకు తోడ్పాటు అందించాలని వారు కోరారు.



