
- గోల్డ్స్ జిమ్ నుండి అనిల్ కుమార్ అడ్వాన్స్‌డ్ ఫిట్‌నెస్ సర్టిఫికేషన్
- దృఢమైన ఆరోగ్యం కోసం.. నిపుణుడి శిక్షణ
- సర్టిఫైడ్ ఫిట్‌నెస్ కోచ్‌గా అనిల్ బాండ్
జనవాహిని ప్రతినిధి తాండూరు : నగరానికి చెందిన ప్రముఖ ఫిట్‌నెస్ ట్రైనర్ అనిల్ కుమార్ అంతర్జాతీయ స్థాయి గుర్తింపు ఉన్న ‘గోల్డ్స్ జిమ్ ఫిట్‌నెస్ ఇన్‌స్టిట్యూట్’ (GGFI) నుండి ‘అడ్వాన్స్‌డ్ పర్సనల్ ట్రైనింగ్’ కోర్సును విజయవంతంగా పూర్తి చేశారు. ఈ మేరకు ఆయనకు ఇన్‌స్టిట్యూట్ ప్రతినిధులు ధ్రువీకరణ పత్రాన్ని అందజేశారు.ఈ కోర్సులో భాగంగా అనిల్ కుమార్ బాడీ బిల్డింగ్, వెయిట్ మేనేజ్‌మెంట్, మరియు అడ్వాన్స్‌డ్ స్ట్రెంత్ ట్రైనింగ్‌లో ప్రత్యేక నైపుణ్యం సాధించారు. శాస్త్రీయ పద్ధతుల్లో వ్యాయామాలు చేయించడం, శరీర అనాటమీకి తగ్గట్లుగా డైట్ ప్లాన్ రూపొందించడం వంటి అంశాల్లో ఆయన శిక్షణ పొందారు.
అన్ని వర్గాలకు ఫిట్‌నెస్ సేవలు..!
కేవలం యువతకే కాకుండా పిల్లలు, మహిళలు మరియు వృద్ధులకు తగిన విధంగా సురక్షితమైన వ్యాయామ పద్ధతులను అందించనున్నట్లు అనిల్ కుమార్ తెలిపారు. కండరాల దృఢత్వం, బరువు తగ్గడం మరియు జీవనశైలి మార్పుల ద్వారా ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలో తన శిక్షణ ద్వారా వివరిస్తానని ఆయన పేర్కొన్నారు. మన ఆరోగ్యం మన చేతులోన్నే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క వ్యాయామం చెయ్యాలని, ప్రస్తుత సీతకాలం వ్యాయామానికి సహకరిస్తుందని అనిల్ పేర్కొన్నారు. వ్యాయామం చేస్తూ ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. ఈ సర్టిఫికేషన్ ద్వారా మరింత మందికి వృత్తిపరమైన సేవలు అందించే అవకాశం కలిగిందని ఆయన ఆనందం వ్యక్తం చేశారు.



