పునర్నిర్మాణ మహాకార్యం…!

- రామ మందిరం లో గడప పూజ
- వేగవంతంగా రాంమందిర్ పునర్నిర్మాణ పనులు
- గడప పూజతో ప్రారంభం-
- భక్తులు సహకరించాలని కమిటీ విజ్ఞప్తి

జనవాహిని ప్రతినిధి తాండూరు : తాండూరు పట్టణం ఇంద్రనగర్‌లోని ఏకైక రామ మందిరం పునర్నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ పునర్నిర్మాణంలో భాగంగా ఆలయ అంతరాలయం యొక్క గడప పూజా కార్యక్రమాన్ని కమిటీ సభ్యులు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు.ఈ శుభ కార్యకమానికి డాక్టర్ జనార్దన్ రెడ్డి హాజరై ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఆలయానికి గడప దాతలైన హౌసుల సత్యం, రవీందర్ కుమార్ కూడా ఈ పూజా కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ, ఆలయ పునర్నిర్మాణ మహాకార్యంలో భక్తులు ముందుకు వచ్చి, తమ వంతు సహకారాన్ని ఉదారంగా అందించాలని కోరారు. దాతల సహకారంతో ఆలయాన్ని మరింత సుందరంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు.

ఈ పూజా కార్యక్రమం లో రామ మందిరం అధ్యక్షులు శ్రీనివాస్, అధ్యక్షులు కే. శేఖర్, బోయ రాజు, యాదగిరి చారి,ఉపాధ్యక్షులు దోమ శ్రీనివాస్, కే వెంకటేష్ ,కోశాధికారి అంజిల్ రెడ్డిప్రధాన కార్యదర్శిలు ఆనంద్ కుమార్, మొగులప్ప,రాము చారి, ప్రవీణ్ కుమార్, హనుమయ్య, నర్సింల, భద్రప్ప, దౌల్తాబాద్ నర్సింలు, కృష్ణ, చందు, శ్రావణ్, అనిల్ కుమార్, తిరుపతి, యాదవ చారి, రమేష్. లు ఉన్నారు.



