
- తాండూరులో పోలీసుల తనిఖీలు…!
- 11 మందిపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు
జనవాహిని ప్రతినిధి తాండూరు : తాండూరు పట్టణంలో పోలీసులు నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో 11 కేసులు నమోదయ్యాయి. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పట్టణ పోలీసులు గురువారం రాత్రి నూతన సంవత్సర సందర్బంగా పట్టణంలోని పలు ప్రధాన కూడళ్లలో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు.ఈ సందర్భంగా పట్టణ సీఐ సంతోష్ కుమార్ మాట్లాడుతూ, మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు సంభవిస్తున్నాయని, వాహనదారుల భద్రత దృష్ట్యా ఈ తనిఖీలు నిర్వహించినట్లు తెలిపారు. తనిఖీల్లో భాగంగా మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడిన 11 మందిపై కేసులు నమోదు చేసినట్లు ఆయన వెల్లడించారు.



