Sunday, April 26, 2026

పట్లోళ్ల ప్రశాంత్ ‘బర్త్‌డే’ జోష్…!

-

spot_img
  • అట్టహాసంగా పట్లోళ్ల ప్రశాంత్ జన్మదిన వేడుకలు
  • ముఖ్య అతిథిగా హాజరైన ఆర్బిఓఎల్ అధినేత బుయ్యని శ్రీనివాస్ రెడ్డి
  •  కేక్ కట్ చేయించి శుభాకాంక్షలు తెలిపిన నేతలు
  •  భారీగా తరలివచ్చిన కాంగ్రెస్ నాయకులు, కౌన్సిలర్లు

జనవాహిని ప్రతినిధి తాండూరు : పట్లోళ్ల ప్రశాంత్ జన్మదిన వేడుకలు శనివారం పట్టణంలో అత్యంత వైభవంగా జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా ఆర్బిఓఎల్ అధినేత, కాంగ్రెస్ పార్టీ నాయకులు బుయ్యని శ్రీనివాస్ రెడ్డి హాజరై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రశాంత్ చేత శ్రీనివాస్ రెడ్డి కేక్ కట్ చేయించి, ఆయనకు మిఠాయిలు తినిపించి జన్మదిన శుభాకాంక్షలు అందజేశారు.ఈ వేడుకల్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు మున్సిపల్ కౌన్సిలర్లు, పార్టీ ముఖ్య నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రశాంత్ భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు చేపట్టాలని, ప్రజా సేవలో ముందుండాలని బుయ్యని శ్రీనివాస్ రెడ్డి ఈ సందర్భంగా ఆకాంక్షించారు.కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు, కార్యకర్తలు ప్రశాంత్‌ను శాలువాలు, పూలమాలలతో ఘనంగా సత్కరించారు. తమ అభిమాన నాయకుడి పుట్టినరోజు పురస్కరించుకుని అభిమానులు టపాసులు పేల్చి, మిఠాయిలు పంపిణీ చేస్తూ సందడి చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ శ్రేణులు, యువజన విభాగం నాయకులు మరియు ఇతర ప్రముఖులు భారీగా పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

FOLLOW US

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe

Related Stories