NEWS

పంచాయతీ ఎన్నికల సమరం….!

  • తాండూరులో పోటాపోటీ, వెల్లువెత్తిన నామినేషన్లు
  • 11 గ్రామాల్లో ఏకగ్రీవం

జనవాహిని ప్రతినిధి తాండూరు : వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గంలో ఈసారి పంచాయతీ ఎన్నికల సందడి తారాస్థాయికి చేరింది. అభ్యర్థులు పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేయడంతో నియోజకవర్గమంతా ఎన్నికల వాతావరణం నెలకొంది. సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు దరఖాస్తులు వెల్లువెత్తాయి.తాండూరు నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో (తాండూరు, బషీరాబాద్, యాలాల, పెద్దేముల్‌) కలిపి మొత్తం 149 సర్పంచ్‌ స్థానాలు, 1228 వార్డు సభ్యుల స్థానాలు ఉన్నాయి.

నామినేషన్ల స్వీకరణకు చివరి రోజున (శనివారం) అభ్యర్థుల నుంచి పెద్ద ఎత్తున స్పందన లభించింది. తాండూరు మండలం సర్పంచ్ అభ్యర్థులు 166 వార్డ్ మెంబెర్ లు 577, బషీరాబాద్ మండలం సర్పంచ్ అభ్యర్థులు 208, వార్డ్ మెంబర్లు 816,యాలాల మండలం లో సర్పంచ్ అభ్యర్థులు 195 వార్డ్ మెంబర్లు 584,పెద్దేముల్‌ మండలం లో 221, వార్డ్ మెంబర్లు 670,

మొత్తం నియోజకవర్గం లో సర్పంచ్ అభ్యర్థులు 790 వార్డ్ మెంబర్లు 2447 

మొత్తంగా, నియోజకవర్గంలోని 149 సర్పంచ్‌ స్థానాలకు 790 మంది, మరియు 1228 వార్డు సభ్యుల స్థానాలకు 2447 మంది అభ్యర్థులు తమ నామినేషన్లను సమర్పించారు.

ఏకగ్రీవంగా 11 గ్రామ పంచాయతీలు: 

నామినేషన్ల ప్రక్రియలో కొన్ని గ్రామాల్లో ఏకాభిప్రాయం కుదిరింది. తాండూరు నియోజకవర్గంలో ఇప్పటివరకు 11 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం అయ్యే అవకాశం ఉన్నట్టు సమాచారం.

పెద్దేముల్‌ మండలంలో : సిద్ధన్నమడుపుతాండ లో విజయ్, వీరా సింగ్ లు రెండున్నర సంవత్సరాల పాటు ఒప్పందంతో పంచాయతీని ఏకగ్రీవం చేసుకున్నారు. అదేవిధంగా దుర్గాపూర్ సర్పంచ్ గా బుడిగ జంగం మంగమ్మ ఏకగ్రీవం చేశారు.

యాలాల మండలంలో: లక్ష్మీనారాయణ పుర్ గ్రామానికి గుర్రాల నాగమణి ఒకరే సర్పంచ్ గా నామినేషన్ వేశారు. దీంతో ఈ గ్రామం ఏకగ్రీవం కానుంది. సంగేమ్ కుర్డ్ లో సుధా లక్ష్మి, కిష్టాపూర్ లో స్వప్న, సంగాయి గుట్ట తండాలో కిషన్ నాయక్, రాసనం లో మల్లేశం లు ఓకే నామినేషన్ వేయడంతో ఆ గ్రామాలు కూడా ఏకగ్రీవంగా కానున్నాయి.

తాండూరు మండలం : చిట్టి గణపురం గ్రామంలో పటేల్ విజయ్ కుమార్ ఒకరే సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు.

బషీరాబాద్‌ మండలంలో: మంతన్ గౌడ్ లో ఎరుకుల బీమప్ప ఒకరే సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేయడంతో ఏకగ్రీవం కానుంది. అదేవిదంగా హంక్యా నాయక్ తాండ లో అనిత రాథోడ్, బాబు నాయక్ తండాలో, జరుపుల అనిత లు ఒకరి నామినేషన్ వేయడంతో ఆ గ్రామాలు కూడా ఏకగ్రీవం కానున్నాయి.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

You cannot copy content of this page

error: Content is protected !!