శరణు ఘోషకు వేళాయె..!

- స్వామియే శరణం అయ్యప్ప
- తాండూరులో వచ్చే నెల 4న అయ్యప్ప మహా పడిపూజ
- మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఆధ్వర్యం
జనవాహిని ప్రతినిధి తాండూరు: శబరిమల యాత్ర దీక్షలో ఉన్న అయ్యప్ప స్వాములు, భక్తులకు శుభవార్త. తాండూరు మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఆధ్వర్యంలో వచ్చే నెల (డిసెంబర్) 4వ తేదీన అయ్యప్ప మహా పడిపూజ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు.మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి నివాసంలో ఈ దివ్యమైన పడిపూజ కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయ్యప్ప స్వామి ఆశీస్సులు అందరిపై ఉండాలనే ఉద్దేశ్యంతో ఈ మహా పడిపూజను నిర్వహిస్తున్నారు.

తాండూరు లోని మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి నివాసం లో వచ్చే నెల 4 న సాయంత్రం 6: 05 గంటలకు పడి పూజ నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ మహా పడిపూజలో స్వామి వారికి ప్రత్యేక అలంకరణలు, పద్దెనిమిది మెట్లకు పూజలు, దివ్య నామ సంకీర్తనలు నిర్వహించనున్నట్లు తెలిపారు.ఈ పవిత్రమైన కార్యక్రమానికి అయ్యప్ప స్వాములు, భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి, భక్తిశ్రద్ధలతో ఈ పడిపూజలో పాల్గొని, ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప నామస్మరణతో స్వామివారి కృప కటాక్షములకు పాత్రులు కాగలరని ఆయన కోరారు. పడిపూజానంతరం భక్తులందరికీ తీర్థ ప్రసాద వితరణ ఉంటుందని రోహిత్ రెడ్డి వెల్లడించారు.



