Friday, April 3, 2026

నవశకానికి నాంది ‘నాగలక్ష్మి’….!

-

  • అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్ ‘కొట్రిక’.. వార్డు సేవలో వారసురాలు ‘నాగలక్ష్మి’!
  •  24వ వార్డు బిఆర్ఎస్ అభ్యర్థిగా కొట్రిక నాగలక్ష్మి పోటీ
  •  అత్తమ్మ ఆశయాలే బాటగా.. ప్రజల దీవెనలే అండగా రంగంలోకి..
  •  తాండూరు మున్సిపల్ ఎన్నికల్లో హాట్ టాపిక్‌గా మారిన ‘కోడలి’ ఎంట్రీ!

జనవాహిని ప్రతినిధి తాండూరు :  రాజకీయాలు అంటే కేవలం పదవులు కాదు.. ప్రజల గుండెల్లో సంపాదించుకున్న నమ్మకం అని నిరూపించిన కుటుంబం ‘కొట్రిక’ కుటుంబం. ఇప్పుడు అదే నమ్మకాన్ని, అదే సేవా పథాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు కొట్రిక నాగలక్ష్మి సిద్ధమయ్యారు. తాండూరు మున్సిపల్ 24వ వార్డు బిఆర్ఎస్ కౌన్సిలర్ అభ్యర్థిగా ఆమె బరిలో నిలవడం ఇప్పుడు పట్టణమంతా చర్చనీయాంశంగా మారింది.

అత్తమ్మ అడుగుజాడల్లో…. కోడలు..! 

​తాండూరు మున్సిపల్ మాజీ చైర్‌పర్సన్ కొట్రిక విజయలక్ష్మి ఈ పట్టణానికి చేసిన సేవలు చిరస్మరణీయం. ఒక సమర్థవంతమైన నాయకురాలిగా ఆమె వేసిన ముద్ర చెరిగిపోనిది. ఇప్పుడు ఆమె రాజకీయ వారసురాలిగా, ఆమె కోడలు నాగలక్ష్మి రంగంలోకి దిగడం విశేషం. అత్తగారి అనుభవం, మార్గదర్శకత్వంలో వార్డును అభివృద్ధి పథంలో నడిపిస్తానని నాగలక్ష్మి ఇస్తున్న హామీ ప్రజల్లో కొత్త ఆశలను రేకెత్తిస్తోంది.

మహిళా శక్తికి నిలువుటద్దం..

​కేవలం పేరుకే వారసురాలు కాదు.. చేతల్లోనూ ఆమె కార్యశీలి. తాండూరు ఆర్యవైశ్య మహిళా అధ్యక్షురాలుగా ఆమె చేస్తున్న సేవలు అపారం. ఆపదలో ఉన్న వారికి అండగా నిలవడం, మహిళల సమస్యలపై గళం విప్పడం ఆమెకు వెన్నతో పెట్టిన విద్య. ఈ సేవా గుణమే నేడు ఆమెను వార్డులో బలమైన నాయకురాలిగా నిలబెట్టింది.

జనం మెచ్చిన నేత.. గెలుపు ముంగిట!

​24వ వార్డులో ఎక్కడ చూసినా నాగలక్ష్మి గురించే చర్చ. మన కొట్రిక విజయలక్ష్మి కోడలు వస్తోంది.. మన సమస్యలు తీరుస్తుంది అనే ధీమా ఓటర్లలో కనిపిస్తోంది. ఆ కుటుంబంపై ఉన్న గౌరవం, నాగలక్ష్మి వ్యక్తిత్వం తోడవ్వడంతో వార్డులో గెలుపు సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి. సామాన్యుల నుండి మేధావుల వరకు అందరూ కొట్రిక కుటుంబానికే జై కొడుతుండటంతో, గెలుపు లాంఛనమేనని స్పష్టమవుతోంది.

అభివృద్ధికి చిరునామాగా, నమ్మకానికి మారుపేరుగా నిలిచిన కొట్రిక కుటుంబం నుండి వస్తున్న నాగలక్ష్మికి 24వ వార్డు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ ఎన్నికల్లో ఆమె విజయం వార్డు అభివృద్ధికి కొత్త వెలుగులు నింపడం ఖాయమని తెలుస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

FOLLOW US

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
spot_img

Related Stories