జర్నలిస్ట్ యూనియన్ జిల్లా కార్యవర్గం రద్దు..
వికారాబాద్ జిల్లా TUWJ (H-143) నూతన అడహక్ కమిటీ నియామకం

- రంగంలోకి నూతన అడహక్ కమిటీ
- TUWJ జిల్లా బాధ్యులుగా ఆసిఫ్ హుస్సేన్ బృందం
- నియామక పత్రాలు అందజేసిన అల్లం నారాయణ
జనవాహిని ప్రతినిధి వికారాబాద్: వికారాబాద్ జిల్లా తెలంగాణ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్ (TUWJ–H143) నూతన అడహక్ కమిటీని నియమిస్తూ రాష్ట్ర కార్యవర్గం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఉన్న జిల్లా కార్యవర్గాన్ని రద్దు చేస్తూ, కొత్త బాధ్యులను నియమిస్తూ రాష్ట్ర అధ్యక్షులు అల్లం నారాయణ, ప్రధాన కార్యదర్శి ఆస్కాని మారుతీ సాగర్ ఉత్తర్వులు జారీ చేశారు.యాదగిరిగుట్టలో జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఈ ప్రకటన చేశారు.
నూతన కమిటీ వివరాలు…
జిల్లా కన్వీనర్: ఆసిఫ్ హుస్సేన్ జిల్లా కో–కన్వీనర్లుజీ. నర్సిములు, ప్రహ్లాద్ చారి, టి. ఆనంద్, శ్రీనివాస్వికారాబాద్ నియోజకవర్గ కన్వీనర్, జావేద్ నియోజకవర్గ కో–కన్వీనర్ రాజు జిల్లాలో పూర్తిస్థాయి కమిటీని ఏర్పాటు చేసే వరకు ఈ అడహక్ కమిటీయే యూనియన్ బాధ్యతలను పర్యవేక్షిస్తుందని రాష్ట్ర నాయకత్వం స్పష్టం చేసింది.ఈ సందర్భంగా నూతన కన్వీనర్ ఆసిఫ్ హుస్సేన్ మరియు కో–కన్వీనర్లు మాట్లాడుతూ, తమపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన అల్లం నారాయణకు, మారుతీ సాగర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో 33 జిల్లాలకు చెందిన యూనియన్ ముఖ్య నాయకులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. జిల్లాలోని జర్నలిస్టులందరూ యూనియన్ బలోపేతానికి సహకరించాలని నూతన కమిటీ కోరింది.



