
- మున్సిపల్ ఎన్నికల బరిలో బోయ అనిల్ కుమార్
- 6వ వార్డు అభివృద్ధియే ధ్యేయం
జనవాహిని ప్రతినిధి తాండూరు : మున్సిపల్ ఎన్నికల హడావిడి మొదలైంది. ఈ క్రమంలో 6వ వార్డ్ అభ్యర్థిగా యువ నాయకుడు బోయ అనిల్ కుమార్ మరోసారి ఎన్నికల బరిలోకి దిగుతున్నట్లు ప్రకటించారు. గత కొంతకాలంగా వార్డు ప్రజలతో మమేకమవుతూ, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న అనిల్ కుమార్, ఈసారి కూడా వార్డు అభివృద్ధిని కాంక్షిస్తూ ప్రజల మద్దతు కోరుతున్నారు.ఈ సందర్భంగా అనిల్ కుమార్ మాట్లాడుతూ, తనపై నమ్మకంతో మద్దతు తెలుపుతున్న వార్డు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యంగా వార్డులో మౌలిక సదుపాయాల కల్పన, మెరుగైన డ్రైనేజీ వ్యవస్థ, వీధి దీపాలు మరియు తాగునీటి సమస్యల పరిష్కారం కోసం నిరంతరం శ్రమిస్తానని హామీ ఇచ్చారు.వార్డును మోడల్ వార్డుగా తీర్చిదిద్దేందుకు తన వద్ద స్పష్టమైన ప్రణాళిక ఉందని ఆయన వెల్లడించారు. . 6వ వార్డు అభివృద్ధి కోసం కట్టుబడి ఉంటాను అని అనిల్ కుమార్ స్పష్టం చేశారు.



