- మున్సిపల్ ఎన్నికల బరిలో చాంద్ పాషా
- 20వ వార్డు నుండి పోటీకి సిద్ధం
జనవాహిని ప్రతినిధి తాండూరు : స్థానిక మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ సందడి మొదలైంది. బిఆర్ఎస్ పార్టీ మైనారిటీ ప్రెసిడెంట్ మహమ్మద్ చాంద్ పాషా ఈసారి ఎన్నికల బరిలో దిగుతున్నట్లు ప్రకటించారు. గత పదేళ్లుగా పార్టీ లో ఉంటూ… మైనారిటీ అధ్యక్షునిగా కొనసాగుతూ, అనేక సేవా కార్యక్రమాల ద్వారా ప్రజలకు చేరువైన ఆయన, ఈసారి 20వ వార్డు నుండి తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వార్డులో డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచడం, రోడ్ల నిర్మాణం మరియు ఇతర మౌలిక వసతుల కల్పనే తన ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఒకవేళ 20వ వార్డు జనరల్ కేటగిరీకి రిజర్వ్ అయితే, ఖచ్చితంగా పార్టీ టికెట్ ఆశిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.పార్టీపై నమ్మకంతో టికెట్ కోసం వేచి చూస్తున్నానని, ఒకవేళ పార్టీ టికెట్ దక్కని పక్షంలో ప్రజాభిప్రాయం మేరకు ఇండిపెండెంట్‌గా అయినా సరే 20వ వార్డు నుండి ఖచ్చితంగా పోటీ చేస్తానని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటికే వార్డులో ప్రచారం మొదలుపెట్టిన ఆయన, ప్రజల ఆశీస్సులు తనకు ఉన్నాయని ధీమా వ్యక్తం చేశారు.






