- బెయిల్ పేపర్ లతో పోలీస్ స్టేషన్ కు పైలెట్
- తప్పుడు కేసులకు భయపడను
- కేసులు మీ మీద పెట్టాలి..
- కౌంటింగ్ సెంటర్ లకు అక్రమంగా చొరబడ్డారు
- తాండూరు ప్రజలు బీఆర్ఎస్ వైపే ఉన్నారు
- మీడియా సమావేశం లో మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి
జనవాహిని ప్రతినిధి తాండూరు : తాండూరు ఎమ్మెల్యే కు ప్రజలు నంగనాచి అనే బిరుదు ఇచ్చారని తాండూరు మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి అన్నారు. రంగులు మార్చే ఊసరవెల్లి, నాయకులను వాడుకొని వదిలేస్తున్న ఎమ్మెల్యే అని ప్రజలే అంటున్నారని రోహిత్ రెడ్డి ఆరోపించారు. ఈ సందర్బంగా…. తాజాగా ముగిసిన మున్సిపల్ ఎన్నికల్లో మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి పై నమోదైన కేసులో హైకోర్టు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసింది. కాగా సోమవారం మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి బెయిల్ పేపర్ లతో తాండూరు పోలీస్ స్టేషన్ కు వచ్చి విచారణ లో పాల్గొన్నారు. అనంతరం ఆయన నివాసం లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశం రోహిత్ రెడ్డి మాట్లాడుతూ….. తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి పై విమర్శలు చేశారు. ఈ సందర్బంగా పైలెట్ మాట్లాడుతూ…. బిఆర్ఎస్ పార్టీ గెలుస్తుందనే భయం తో, తమ పార్టీ పరాజయం పొందే అవకాశం ఉందని భావించిన ఎమ్మెల్యే ఎన్నికల కౌంటింగ్ సెంటర్ లోకి చొరబడ్డారని ఆరోపించారు. దాదాపు 30మంది కాంగ్రెస్ అనుచరులతో కౌంటింగ్ సెంటర్ లకు వెళ్లిన ఎమ్మెల్యే పై కేసు నమోదు చేయ్యకుండా… ఏందుకు వెళ్లారని ప్రశ్నిస్తే మాపై కేసులు పెట్టరాని రోహిత్ రెడ్డి చెప్పుకొచ్చారు. ఎన్ని కేసులు పెట్టిన, ఎన్ని కుట్రలు చేసిన దేనికి భయపడేదే లేదన్నారు. ప్రజలు బిఆర్ఎస్ పార్టీ వైపే ఉన్నారని ఈ ఎన్నికల్లో దాదాపు 19వేలకు పైగా ఓట్లు బిఆర్ఎస్ పార్టీ కి వచ్చాయని అన్నారు. కేవలం కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుందనే భయం తోనే తాండూరు ఎమ్మెల్యే దౌర్జన్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ప్రజలు కాంగ్రెస్ పార్టీ ని నమ్మడం లేదని, బిఆర్ఎస్ పార్టీ వైపే ఉన్నారన్నారు. సర్పంచ్ ఎన్నికలో చేసినట్టే మున్సిపల్ ఎన్నికల్లో కూడా దాదాగిరి, రౌడీయిజాం చేస్తూ బిఆర్ఎస్ నాయకులను భయబ్రాంతులకు గురి చేసిన…. బిఆర్ఎస్ పార్టీ సత్తా ఏంటో ఈ మున్సిపల్ ఎన్నికల్లో చూపించాం అని ధీమా వ్యక్తం చేశారు. తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి నంగనాచి చేష్టలు చేస్తున్నారాని ఊసరవెల్లి లాగా రంగులు మారుస్తున్నారని తాండూరు ప్రజలే మాట్లాడుకుంటున్నారని…. రోహిత్ రెడ్డి విమర్శించారు. అదేవిదంగా… తమపై తప్పుడు కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేసిన దేనికి భయపడం అని, నిజానిజాలు బైటికి తీసి తప్పు ఎవరిదో… వారిపై కేసులు నమోదు చెయ్యాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సమయం లో తాండూరు పోలీసులతో తప్పుగా ప్రవర్తిస్తే క్షమించాలని రోహిత్ రెడ్డి కోరారు.



