Monday, March 16, 2026

ఉద్యోగులకు పీఎఫ్ లేదు కానీ.. ఓటర్లకు ఆఫర్లా?

-

spot_img
  • తాండూరులో ‘ఆఫర్’ రాజకీయం.. ఓటుకు ‘డిస్కౌంట్’ కూపన్!
  • 13వ వార్డుపై విఠల్ నాయక్ & గ్యాంగ్ కన్ను
  • అభివృద్ధి కాదు.. అంతా ‘పక్కా’ వ్యాపారం
  • కబ్జా ముఠాలను అడ్డుకుంటాం: 13వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి రాములు నాయక్ ఆగ్రహం 

జనవాహిని ప్రతినిధి తాండూరు : తాండూరు రాజకీయాల్లో ‘ఆఫర్ల’ పర్వం కలకలం రేపుతోంది. ప్రజా సేవ పేరుతో రంగంలోకి దిగిన కొందరు నాయకులు, రాజకీయాలను కాస్తా ప్రైవేట్ వ్యాపారంగా మార్చేశారని 13 వ వార్డ్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాములు నాయాక్ మండిపడ్డారు. 13వ వార్డులో విఠల్ నాయక్, వరాల శ్రీనివాస్ రెడ్డి, సురేష్ నాయక్ త్రయం చేస్తున్న హడావుడిపై ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారన్నారు. ఈ రోజు 50% ఆఫర్.. రేపు 100% మోసం చేస్తారని రాములు నాయక్ ఆరోపించారు. తాండూరు పట్టణంలో 13వ వార్డు ప్రస్తుతం వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతం, ఔటర్ రింగ్ రోడ్డు, చిలుక వాగు, తాండూర్ వాగు వంటి భౌగోళిక అనుకూలతలు ఉండటంతో ఈ ఏరియాపై ‘కబ్జా’ ముఠాల కన్ను పడిందని ఆయన ఆరోపించారు. వార్డును అభివృద్ధి చేయడం పక్కన పెట్టి, ఇక్కడి భూములను, వనరులను హస్తగతం చేసుకునేందుకే ఈ ముగ్గురు నాయకులు జట్టు కట్టారని వార్డు రాములు నాయక్ బహిరంగంగానే ప్రకటన చేశారు. ఎన్నికల బరిలో నిలిచే నాయకులు రోడ్లు, డ్రైనేజీలు, మౌలిక వసతుల గురించి మాట్లాడాలి. కానీ, విఠల్ నాయక్ గ్యాంగ్ మాత్రం తమ సొంత వ్యాపారాలైన కన్వెన్షన్ హాల్స్, ప్రైవేట్ హాస్పిటల్స్, నర్సింగ్ కాలేజీల్లో ‘డిస్కౌంట్లు’ ఇస్తామంటూ ఓటర్లను ప్రలోభపెట్టడంపై ఆయన విమర్శలు గుప్పిస్తున్నారు.ఉద్యోగాల పేరుతో 50% కలెక్షన్లు వసూలు చేయడం నిజం కాదా?మీ దగ్గర పనిచేసే ఉద్యోగులకు PF, ESI సౌకర్యాలు ఎందుకు కల్పించడం లేదు?ప్రైవేట్ బిజినెస్ ఆఫర్లు ఇవ్వడం ప్రభుత్వ పథకం ఎలా అవుతుంది? అని రాములు నాయక్ ప్రశ్నించారు. పవిత్రమైన ఓటును డిస్కౌంట్ కూపన్‌గా మార్చాలని చూస్తున్న ‘బిఆర్ఎస్ మాఫియా’ ఆటలు సాగనివ్వమని 13వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి హెచ్చరించారు. డబ్బుతో, రాయితీలతో ఓట్లను కొనాలని చూస్తే తగిన బుద్ధి చెప్తామని మండిపడ్డారు. తాండూరుకు కావాల్సింది ‘డీల్’ కుదుర్చుకునే నాయకులు కాదని, ప్రజల కోసం పోరాడే నాయకులని ఆయన స్పష్టం చేశారు. ఈ కబ్జా ప్రయత్నాలను అడ్డుకోవడానికి వార్డు ప్రజలంతా ఏకమవుతున్నారని, తప్పకుండ ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

FOLLOW US

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe

Related Stories