Thursday, March 19, 2026

ఉగాది శుభాకాంక్షలు తెలిపిన కౌన్సిలర్…!

-

spot_img
  • పరాభవ’ ఉగాది శుభాకాంక్షలు…! 
  • కౌన్సిలర్ పటేల్ సుప్రీత కరుణాకర్

జనవాహిని ప్రతినిధి తాండూరు : తెలుగు నూతన సంవత్సరమైన ‘పరాభవ’ నామ సంవత్సర ఉగాది పండుగను పురస్కరించుకుని తాండూరు నియోజకవర్గ ప్రజలకు, ముఖ్యంగా 34వ వార్డు ప్రజలకు తాండూరు మున్సిపల్ కౌన్సిలర్ పటేల్ సుప్రీత కరుణాకర్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా ఆమె ఒక ప్రకటన విడుదల చేస్తూ, కొత్త ఏడాదిలో ప్రజలందరి జీవితాలు సుఖశాంతులతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఈ పరాభవ నామ సంవత్సరంలో రాష్ట్రవ్యాప్తంగా సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురిసి, భూమాత పచ్చని పంటలతో కనువిందు చేయాలని కోరుకున్నారు. తద్వారా రైతన్నలకు మేలు జరగాలని, వ్యవసాయ రంగం అభివృద్ధి చెందాలని ఆశాభావం వ్యక్తం చేశారు.అదేవిధంగా, వ్యాపారస్తులు ఆర్థికంగా పురోగతి సాధించాలని, అన్ని వర్గాల ప్రజలు ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో తులతూగాలని ఆమె ప్రార్థించారు. తెలంగాణ రాష్ట్రం సస్యశ్యామలం కావాలని, ప్రతి ఇంటా ఉగాది పండుగ కొత్త ఉత్సాహాన్ని నింపాలని సుప్రీత కరుణాకర్ ఈ సందర్బంగా ఆకాంక్షించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

FOLLOW US

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe

Related Stories