Monday, March 16, 2026

అభిమానం ‘అక్షర’ రూపం….!

-

spot_img
  •  కౌన్సిలర్ అభ్యర్థి పేరుతో యువకుడి వినూత్న కటింగ్!
  • వార్డు ప్రతినిధిపై వీరభిమానం చాటుకున్న యువకుడు
  • ఎల్లప్ప గెలుపే లక్ష్యం 

జనవాహిని ప్రతినిధి తాండూరు : సాధారణంగా అభిమానం అంటే ఫ్లెక్సీలు కట్టడం, నినాదాలు చేయడం చూస్తుంటాం. కానీ ఈ యువకుడు మాత్రం తన అభిమాన నాయకుడి పేరును ఏకంగా తన గుండెల్లోనే కాదు, తలపైన కూడా చెక్కించుకున్నాడు. 15వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి ఎల్లప్పపై ఉన్న వీరభిమానంతో ఒక యువకుడు తన తలకట్టును వినూత్నంగా రూపొందించుకున్నాడు.ఎన్నికల ప్రచారం ఊపందుకున్న తరుణంలో, సదరు అభిమాని తన జుట్టును ‘YELLAPPA’ అనే ఆంగ్ల అక్షరాలు వచ్చేలా కటింగ్ చేయించుకున్నాడు. అభ్యర్థి ఎల్లప్ప పట్ల ఉన్న అచంచలమైన విశ్వాసం మరియు ప్రేమను చాటుకోవడానికే తాను ఇలా చేశానని ఆ యువకుడు పేర్కొన్నాడు. ప్రచారంలో భాగంగా వీధుల్లో తిరుగుతున్నప్పుడు ఈ వినూత్న హెయిర్ స్టైల్‌ను చూసి అటు ప్రజలు, ఇటు కార్యకర్తలు ఆశ్చర్యపోతున్నారు.నాయకుడి పట్ల కార్యకర్తలకు ఉండే నిబద్ధతకు ఈ ఘటన నిదర్శనమని స్థానికులు చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తోంది. ఎల్లప్ప గెలుపు ఖాయమని స్థానికంగా అభిమానులు, కార్యకర్తలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

FOLLOW US

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe

Related Stories