శ్రీరామ సేవకు చేయూత..!

- రామమందిర పునర్నిర్మాణానికి భక్తుల విరాళాల వెల్లువ!
- డీసీసీ అధ్యక్షులు ధారాసింగ్ విరాళం!
- శ్రీ రాముని సేవలో అందరు భాగస్వామ్యం కావాలని ఆలయ కమిటీ విజ్ఞప్తి.
జనవాహిని ప్రతినిధి తాండూరు : తాండూర్ పట్టణంలోని ఇంద్ర నగర్ లో గల ఏకైక శ్రీరామ మందిరం పునర్నిర్మాణం ఇప్పుడు ఒక మహాయజ్ఞంలా మారింది. తమ ఇష్టదైవమైన శ్రీరామచంద్రుని ఆలయాన్ని వైభవంగా తీర్చిదిద్దేందుకు భక్తులంతా స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు. ప్రతి ఒక్కరూ తమకు తోచిన విధంగా విరాళాలు అందిస్తూ, ఈ పవిత్ర కార్యక్రమంలో భాగస్వాములవుతున్నారు.ఈ పుణ్యకార్యానికి చేయూతనిస్తూ, డీసీసీ అధ్యక్షులు ధారాసింగ్ తమ దాతృత్వాన్ని, రామభక్తిని చాటుకున్నారు. ఆలయ పునర్నిర్మాణనికి ఆయన రూ. 50వేలు విరాళంగా ఆలయ కమిటీకి అందించారు. తమవంతుగా ఈ నగదును విరాళంగా అందించి, ఆయన భక్తులకు ఆదర్శంగా నిలిచారు.శ్రీరాముని ఆలయ పునర్నిర్మాణంలో భాగస్వాములవుతున్న భక్తులందరికీ కమిటీ సభ్యులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అలాగే, ఆలయాన్ని త్వరితగతిన పూర్తి చేయడానికి, భక్తులు ధన రూపేణా లేదా వస్తు రూపేణా తమ విరాళాలను అందించి, ఈ ఆలయ పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలని, ఆ శ్రీరాముని ఆశీస్సులను పొందాలని వారు భక్తిభావంతో విన్నవించుకున్నారు.



