రాములోరి సేవలో బీరప్ప ఆలయ కమిటీ సభ్యులు

శరవేగంగా శ్రీ రామచంద్రస్వామి ఆలయ పునర్నిర్మాణ పనులు
- రాముని సేవలో బీరప్ప ఆలయ కమిటీ,
జనవాహిని ప్రతినిధి తాండూరు : తాండూరు పట్టణంలోని ఇందిరానగర్లో వెలసిన ఏకైక శ్రీ రామచంద్రస్వామి ఆలయ పునర్నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఈ పవిత్ర కార్యంలో స్థానిక ప్రజలు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొంటూ తమ భక్తిని చాటుకుంటున్నారు. సోమవారం ఆలయ పునర్నిర్మాణ పనులను బీరప్ప ఆలయ కమిటీ, కురుమ సంఘం సభ్యులు నాయకులు ప్రత్యేకంగా పరిశీలించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రామాలయ పునర్నిర్మాణం అనేది ఒక పవిత్రమైన యజ్ఞమని, ఈ గొప్ప కార్యంలో భాగస్వాములు కావడం తమ అదృష్టమని పేర్కొన్నారు. పట్టణ ప్రముఖులు, దాతలు ఇప్పటికే తమవంతు సహాయ సహకారాలు అందిస్తున్నారని, ఆలయ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ ఆర్థికంగా కానీ, వస్తు రూపంలో కానీ తోడ్పాటునందించాలని వారు విజ్ఞప్తి చేశారు.రాములోరి సేవలో తరించి, స్వామివారి కృపకు పాత్రులు కావాలని భక్తులను కోరారు. ఉదార స్వభావంతో దాతలు ముందుకు వచ్చి ఆలయ పూర్తికి సహకరించాలని ఆలయ కమిటీ సభ్యులు కోరారు. ఈ కార్యక్రమంలో కురుమ సంఘం నాయకులు, స్థానిక భక్తులు మరియు ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.



