రాముని సేవలో తాండూరు…!

- ఆలయ పునఃనిర్మాణానికి భక్తుల స్పందన
- ఒకే రోజు 11 మంది దాతల ఉదారత..
- వేగంగా కొనసాగుతున్న పనులు
- దాతలు సహకరించాలని కమిటీ సభ్యుల విజ్ఞప్తి
జనవాహిని ప్రతినిధి తాండూరు : పట్టణంలోని ఇందిరానగర్ లోని ఏకైక శ్రీరామ చంద్రుని ఆలయ పునఃనిర్మాణ కార్యంలో స్థానిక భక్తులు ఉత్సాహంగా భాగస్వాములవుతున్నారు. ‘రామకోటి’ పుణ్యఫలం దక్కించుకోవాలనే సంకల్పంతో దాతలు తమ వంతు ఆర్థిక సాయాన్ని అందజేస్తున్నారు. తాజాగా గురువారం ఒకే రోజు పట్టణానికి చెందిన 11 మంది ప్రముఖులు ఆలయ కమిటీకి తమ విరాళాలను అందజేశారు. దాతల సహకారంతో నిర్మాణ పనులు అత్యంత వేగంగా, నాణ్యతతో కొనసాగుతున్నాయని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.
దాతల వివరాలు…ఆలయ నిర్మాణ నిధికి విరాళం ప్రకటించిన వారిలో కాల్వ రాజలింగం రూ. 51,000, కాసుల రాజు (కోట్పల్లి) రూ. 51,000 అందజేసి తమ భక్తిని చాటుకున్నారు. వీరితో పాటు గడ్డల రవి రూ. 25,000, మునుగంటి బ్రహ్మం రూ. 21,000, మునుగంటి నరసింహ చారి రూ. 21,000 చొప్పున విరాళం ఇచ్చారు. మధుసూదన్ రూ. 11,000, కాల్వ సురేష్ రూ. 5,111, మల్లేశం రూ. 5,100, బలరాం రూ. 5,100, పోదరి రవి చారి రూ. 5,000 మరియు కృష్ణ (ఆర్మీ) రూ. 5,000 లను ఆలయ కమిటీకి అందజేశారు.
ఈ సందర్భంగా ఆలయ పునఃనిర్మాణ కమిటీ సభ్యులు మాట్లాడుతూ.. భక్తుల సహకారం మరువలేనిదని కొనియాడారు. ఆలయ నిర్మాణం త్వరగా పూర్తి కావడానికి ప్రతి ఒక్కరూ తమకు తోచిన ఆర్థిక సాయం అందించి పుణ్యకార్యంలో భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు. విరాళం అందించిన దాతలకు కమిటీ తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.



