
- తాండూరు మున్సిపాలిటీలో తుది ఓటర్ల జాబితా విడుదల
జనవహిని ప్రతినిధి తాండూరు : ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు తాండూరు మున్సిపాలిటీ పరిధిలోని 36 వార్డులకు సంబంధించిన తుది ఓటర్ల జాబితాను సోమవారం మున్సిపల్ కార్యాలయంలో అధికారికంగా ప్రకటించారు.మున్సిపల్ మేనేజర్ నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వార్డుల వారీగా ఓటర్ల జాబితాను ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ తుది జాబితాను ప్రజల సందర్శనార్థం మున్సిపల్ కార్యాలయంలో అందుబాటులో ఉంచామని తెలిపారు. ఓటర్లు తమ పేర్లు, ఇతర వివరాలను జాబితాలో సరిచూసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఇంచార్జ్ శానిటరీ ఇన్స్పెక్టర్ ఉమేష్, టౌన్ ప్లానింగ్ అధికారులు వంశీధర్, నరేష్, జూనియర్ అసిస్టెంట్లు, వార్డు అధికారులు మరియు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.



